Sunday, 26 July 2026
  • Home  
  • సతీష్ రెడ్డి కి ఎమెస్కో పట్టాభి రామ్ చేంజ్ మేకర్ 26 అవార్డు
- ఆంధ్రప్రదేశ్

సతీష్ రెడ్డి కి ఎమెస్కో పట్టాభి రామ్ చేంజ్ మేకర్ 26 అవార్డు

చిరంజీవి చే బహుకరణ జాతీయ భద్రతా మండలి సలహాదారు డి ఆర్ డి ఓ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి కి ఎమెస్కో బి.వి.పట్టాభిరామ్ చేంజ్ మేకర్ 26 అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి అందచేశారు. ఆదివారం హైదరాబాద్ దసపల్లా లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అవార్డు అందచేస్తూ భారతదేశం కు శాస్త్రవేత్తగా రక్షణ కవచం అందించిన ఘనత సతీష్ రెడ్డి దే అని , ఆయన నేతృత్వంలో దేశ భద్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయిందని ప్రశంసించారు. ఎమెస్కో విజయకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న సతీష్ రెడ్డి మాట్లాడుతూ తనకు లభిస్తున్న ప్రశంసలు అవార్డులు అన్ని తనతో పాటు శ్రమించిన శాస్త్ర వేత్తల బృందం కే చెందుతుందని అన్నారు. భారత దేశం క్షిపణి ల నిర్మాణం లో ఏ దేశం పైన ఆధారపడే అవసరం లేదు అని స్పష్టం చేశారు. బి.వి.పట్టాభిరాంతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన పేరు తో తొలి అవార్డు తనకే లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమం లో ఆంధ్ర వైద్య శాఖా మంత్రి సత్యకుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, జయా పట్టాభి రామ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సతీష్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.

చిరంజీవి చే బహుకరణ
జాతీయ భద్రతా మండలి సలహాదారు డి ఆర్ డి ఓ మాజీ ఛైర్మన్ సతీష్ రెడ్డి కి ఎమెస్కో బి.వి.పట్టాభిరామ్ చేంజ్ మేకర్ 26 అవార్డు ను మెగాస్టార్ చిరంజీవి అందచేశారు. ఆదివారం హైదరాబాద్ దసపల్లా లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అవార్డు అందచేస్తూ భారతదేశం కు శాస్త్రవేత్తగా రక్షణ కవచం అందించిన ఘనత సతీష్ రెడ్డి దే అని , ఆయన నేతృత్వంలో దేశ భద్రతకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయిందని ప్రశంసించారు. ఎమెస్కో విజయకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్న సతీష్ రెడ్డి మాట్లాడుతూ
తనకు లభిస్తున్న ప్రశంసలు అవార్డులు అన్ని తనతో పాటు శ్రమించిన శాస్త్ర వేత్తల బృందం కే చెందుతుందని అన్నారు. భారత దేశం క్షిపణి ల నిర్మాణం లో ఏ దేశం పైన ఆధారపడే అవసరం లేదు అని స్పష్టం చేశారు. బి.వి.పట్టాభిరాంతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన పేరు తో తొలి అవార్డు తనకే లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమం లో ఆంధ్ర వైద్య శాఖా మంత్రి సత్యకుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి, జయా పట్టాభి రామ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సతీష్ రెడ్డి ని ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.