Sunday, 26 July 2026
  • Home  
  • భార్య అనారోగ్యంతో మనస్తాపం.. భర్త ఆత్మహత్య.. ఉదయగిరిలో విషాదం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భార్య అనారోగ్యంతో మనస్తాపం.. భర్త ఆత్మహత్య.. ఉదయగిరిలో విషాదం

ఉదయగిరి పట్టణంలోని కోళ్లవీధిలో షేక్ అక్బర్ (55) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని రోజులుగా ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమవడంతో అక్బర్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్‌ఐ బి. మహేంద్ర సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.