Saturday, 19 September 2026
  • Home  
  • గుంతలమయంగా సైతార్‌పేట రోడ్డు..!
- అనకాపల్లి

గుంతలమయంగా సైతార్‌పేట రోడ్డు..!

పున్నమి ప్రతినిధి ఆనంద్ : ఎలమంచిలి మున్సిపాలిటీ నుంచి ఎస్.రాయవరం వైపు వెళ్లే సైతార్‌పేట ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల భయం నెలకొంది. వాహనాల టైర్లు, వీల్స్, సస్పెన్షన్ దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా 15 రోజుల్లోనే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రహదారికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ :

ఎలమంచిలి మున్సిపాలిటీ నుంచి ఎస్.రాయవరం వైపు వెళ్లే సైతార్‌పేట ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది.
నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుంతలను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదాల భయం నెలకొంది.
వాహనాల టైర్లు, వీల్స్, సస్పెన్షన్ దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
తాత్కాలిక మరమ్మతులు చేసినా 15 రోజుల్లోనే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రహదారికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.