చేజర్ల సెప్టెంబర్ 17 ( పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కండాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చీపినాపి వీఆర్వో ఆకుల హరిబాబు, ఆయన తండ్రి పెంచలయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నెల్లూరులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు తన స్వగ్రామమైన రాజుపాలెంకు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


