పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 30 చిట్టమూరు మండలం,
చిట్టమూరు మండల పరిధిలోని మల్లం గ్రామ నందు ఈరోజు టిడిపి నాయకులు గోపి మరియు పుచ్చలపల్లి సుమంత్ ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కార పత్రాల పంపిణీ కార్యక్రమాలు నాయకుల ఆధ్వర్యంలో జరిగింది.
పేదల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పెన్షన్లు, మహిళలు, రైతులు,విద్యార్థులు,యువత,పేద కుటుంబాల సంబంధించిన వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచే ప్రయత్నం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హత అన్న ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు,ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
టిడిపి నాయకులు గోపి మరియు పుచ్చలపల్లి సుమంత్ ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కారపత్రాలు అందిస్తూ సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది.
పేదల జీవన ప్రణాళిక ప్రాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని కూటమి నాయకులు తెలిపారు.



