19 న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 30 వాకాడు మండలం,
జమీన్ కొత్తపాలెం :- పాప రెడ్డి రాజా రామ రెడ్డి. పెద్దకర్మ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు పాపారెడ్డి. పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో జమీన్ కొత్తపాలెంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు సన్నిహితులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాపా రెడ్డి.రాజారామరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు.
పెద్దకర్మ సందర్భంగా సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించి, అనంతరం హాజరైన వారికి భోజన వసతి ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా పలువురు పాపా రెడ్డి.రాజారామ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కార్యక్రమంలో పాపా రెడ్డి. పురుషోత్తం రెడ్డి తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, మీడియా వారు తదితరులు పాల్గొన్నారు.


