బద్రాద్రి కొత్తగూడెం, చుంచుపల్లి మండలం, ఆగస్టు, 21 (పున్నమి ప్రతినిధి)
రామవరం ప్రాంతంలో 7 ఇంక్లైన్ నుంచి వచ్చిన వారికి గతంలో కేటాయించిన ఖాళీ స్థలాల్లో పలువురు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో ఆ స్థలాలు, అసంపూర్తి ఇళ్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. మరోవైపు రామవరం ప్రాంతంలో సొంత ఇల్లు లేని పేద కుటుంబాలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో పాత కొత్తగూడెంలో ఖాళీగా ఉన్న ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించిన విధంగానే రామవరంలోనూ వినియోగంలో లేని ఇళ్లను గుర్తించి స్థానికంగా నివసించే ఇల్లు లేని పేదలకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, ఇళ్లను నిర్మించకుండా వదిలేసిన లబ్ధిదారుల వివరాలను సేకరించి, అర్హులైన నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

