ఆత్మకూరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఆత్మకూరు సీఐ గంగాధర్ హెచ్చరించారు. అనంతసాగరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలు లేదా వినియోగంలో పాల్గొనేవారిపై, రౌడీయిజం ప్రదర్శించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో ఆత్మకూర్ డిఎస్పి కి వేణుగోపాల్ సూచనల మేరకు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్సైలు రాజేష్, అనూష పాల్గొన్నారు.

చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే రౌడీషీట్: ఆత్మకూరు సీఐ గంగాధర్.