ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 4 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చెరువులో చేపలు పడుతుండగా జరిగిన ప్రమాదంలో గిరిజనుడు పల్లిపాటి పుల్లయ్య (62) మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం భార్య శారదమ్మతో కలిసి తెప్పపై చేపలు పడుతుండగా తెప్ప అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. భార్యను రక్షించి ఒడ్డుకు చేర్చిన అనంతరం పుల్లయ్య నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్థులు, స్థానికులు కోరుతున్నారు.

చెరువులో మునిగి గిరిజనుడు మృతి