పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి జిల్లా రిపోర్టr)
ఖమ్మం జిల్లా పరిధి లో గల
కొణిజర్ల, లో
కొణిజర్ల పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకొని, కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201.45 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొణిజర్ల ఎస్సై సూరజ్ తెలిపారు.
వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశాల మేరకు కొణిజర్లలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో, సత్యసాయి ఫౌండరీ ఎదుట పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న TG 17 T 1992 నంబర్ గల బొలెరో వాహనం, దానికి పైలట్‌గా వస్తున్న TS 17 U 1941 నంబర్ గల మారుతీ డిజైర్ కారును అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేశారు.
తనిఖీల్లో బొలెరో వాహనంలో అక్రమంగా ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా, అలాగే తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి 201.45 కిలోల ఎండు గంజాయి, సుమారు రూ.1,00,50,000 విలువైన మాదకద్రవ్యాలు, 7 సెల్‌ఫోన్లు, రూ.2,800 నగదు, ఒక మారుతీ డిజైర్ కారు, ఒక బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని, గంజాయి సరఫరాదారులు మరియు రిసీవర్లు పరారీలో ఉన్నారని ఎస్సై సూరజ్ తెలిపారు. వారిని పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.



