ముధోల్, ఆగస్టు 3(పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్ లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ముధోల్ ఎంపీడీవో లవ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లడుమా, మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే రామారావు పటేల్, మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రణాళికలపై చర్చించనున్నట్లు తెలిపారు.మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.


