కొవ్వూరు జులై 21పున్నమి న్యూస్ ప్రతినిధి.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం గ్రామంలో పూరి జగన్నాథ్ నమూనా రద యాత్ర ఎంతో కన్నులపండుగగా జరిగింది, రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ రధ యాత్ర జరుగుతుంది, దేశం,రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతీ గ్రామంలో ఆ పూరీ జగన్నాదుని ఉత్సవ విగ్రహాలను ప్రతి గ్రామంలో రద యాత్ర ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు, అలాగే కుమారదేవం గ్రామంలో ఎంతో పుణ్యాత్ములు ఉన్నారని హ్హైందవ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క భక్తులు దర్శించుకునేలా ఆ స్వామి వారి రథాన్ని గ్రామ వీధుల్లో ఊరేగింపు గా తిరిగారు,ఈ ఊరేగింపు సందర్భంగా ఇస్కాన్ వారు మాట్లాడుతూ కుమారదేవం మహిళా భక్తులు చాలా భక్తిశ్రద్దలతో స్వామి వారి రదోత్సవం లో పాల్గొని స్వామివారికి యాబై ఆరు రకముల ప్రసాధములు నైవేద్యంగా పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు, ఈకార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


