ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు హాజరై నూతన కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేఖ వెంకట సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి, ఓబీసీ వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓబీసీ మోర్చా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.



