Friday, 28 August 2026
  • Home  
  • కరెంట్ స్తంభాలపై మృత్యుపాశాలు: కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యంపై ఉక్కుపాదం ఎప్పుడు?
- కామారెడ్డి

కరెంట్ స్తంభాలపై మృత్యుపాశాలు: కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యంపై ఉక్కుపాదం ఎప్పుడు?

హైటెన్షన్ వైర్ల రాపిడితో తెగిపడ్డ డిష్ కేబుల్.. రామారెడ్డిలో విద్యుత్ షాక్‌తో ఒకరికి తీవ్ర గాయా లు.. సమయస్ఫూర్తితో కాపాడి ఆసుపత్రికి తరలిం చిన స్థానికులు…అనుమతులు లేకుండానే విద్యు త్ స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్ల గుట్టలు…వైర్ల నెట్‌వర్క్‌కు స్వస్తి పలికి సెటప్‌బాక్స్, డిజిటల్ వ్యవస్థను మాత్రమే కొనసాగించాలని స్థానికుల డిమాండ్ రామారెడ్డి 27ఆగష్టు, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు ప్రమాదపు అంచున దర్శనమిస్తున్నాయి.నిబం ధనలను తుంగలో తొక్కుతూ కేబుల్ టీవీ ఆపరేట ర్లు చేస్తున్న నిర్లక్ష్యపు వైరింగ్ ప్రజల ప్రాణాల మీద కు తెస్తోంది.రామారెడ్డి మండల కేంద్రంలో బుధవా రం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. ప్రధాన రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలపై వేలాడదీసిన డిష్ కేబుల్ వైర్లు ప్రమాదవశాత్తు 11కేవీ హైటెన్షన్ లైన్లకు తగిలి తీవ్ర రాపిడికి గురై తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక యువకుడు పడిగెల భరత్ పై విద్యు త్ సరఫరా అవుతున్న కేబుల్ వైర్ పడటంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై విలవిల్లాడాడు.స్పందించిన స్థానికులు – దక్కిన ప్రాణం: షాక్‌కు గురై ప్రాణా పాయ స్థితిలో ఉన్న భరత్‌ను గమనించిన స్థానిక విలేకరి రామ్మూర్తి అత్యంత ధైర్యసాహసాలతో, సమయస్ఫూర్తితో స్పందించారు. స్థానికులను సమన్వయం చేసుకుంటూ వెంటనే విద్యుత్ సర ఫరా నుంచి భరత్‌ను రక్షించి, వాహనంలో హుటా హుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లో స్పందించి యువకుడి ప్రాణాలను కాపా డిన విలేకరి రామ్మూర్తిని గ్రామస్తులు, స్థానిక నాయ కులు కొనియాడారు.అనుమతులు ఎవరిచ్చారు? నియంత్రణ ఎక్కడ? అసలు విద్యుత్ శాఖ నిబంధ నల ప్రకారం 11కేవీ హైటెన్షన్ లైన్లు వెళ్లే స్తంభాలపై ప్రైవేట్ కేబుల్, ఇంటర్నెట్ వైర్లు అమర్చడం చట్టరీ త్యా నేరం.విద్యుత్ స్తంభాలపై అనుమతులు లేకుండా కేబుళ్లు లాగుతుంటే అధికారులు ఎందు కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు?నెల వారీ చందాలు వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రత, నిర్వహణపై కేబుల్ నిర్వాహకులకు లేదా? గాలివాన వచ్చినా, ఎండ తీవ్రత పెరిగినా హైటెన్షన్ వైర్లకు తగిలేలా వైర్ల గుట్టలు వేలాడుతు న్నా సంబంధిత శాఖ లైన్‌మెన్లు, ఏఈలు ఎందుకు పర్యవేక్షించడం లేదు?వైర్ల వ్యవస్థకు స్వస్తి పలకా లి – సెటప్‌బాక్స్‌లే పరిష్కారం: పట్టణాలు, గ్రామా ల్లో ప్రమాదకరంగా మారిన తీగల వ్యవస్థకు శాశ్వ త పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తు న్నారు. స్తంభాల గుండా అడ్డదిడ్డంగా లాగే కేబుల్ వైరింగ్ వ్యవస్థను పూర్తిగా నిషేధించి, కేవలం డిజి టల్ సెటప్‌బాక్స్ (డిటీఎచ్ / శాటిలైట్ కనెక్ష న్లు) ఆధారిత సేవలనే అనుమతించాలని స్థాని కులు స్పష్టం చేస్తున్నారు. వైర్ల జంఝాటం లేకుం డా శాటిలైట్ సెటప్‌బాక్స్‌లను తప్పనిసరి చేస్తే ఇలాం టి విద్యుత్ ప్రమాదాలను ముందస్తుగానే అరికట్ట వచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ యంత్రాం గం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. విద్యుత్ స్తంభాలపై నిబంధనలకు విరు ద్ధంగా ఉన్న ప్రైవేట్ కేబుల్ వైర్లను వెంటనే తొల గించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు జిల్లా ప్రజలు. .

హైటెన్షన్ వైర్ల రాపిడితో తెగిపడ్డ డిష్ కేబుల్.. రామారెడ్డిలో విద్యుత్ షాక్‌తో ఒకరికి తీవ్ర గాయా లు.. సమయస్ఫూర్తితో కాపాడి ఆసుపత్రికి తరలిం చిన స్థానికులు…అనుమతులు లేకుండానే విద్యు త్ స్తంభాలపై వేలాడుతున్న కేబుల్ వైర్ల గుట్టలు…వైర్ల నెట్‌వర్క్‌కు స్వస్తి పలికి సెటప్‌బాక్స్, డిజిటల్ వ్యవస్థను మాత్రమే కొనసాగించాలని స్థానికుల డిమాండ్

రామారెడ్డి 27ఆగష్టు, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలు ప్రమాదపు అంచున దర్శనమిస్తున్నాయి.నిబం ధనలను తుంగలో తొక్కుతూ కేబుల్ టీవీ ఆపరేట ర్లు చేస్తున్న నిర్లక్ష్యపు వైరింగ్ ప్రజల ప్రాణాల మీద కు తెస్తోంది.రామారెడ్డి మండల కేంద్రంలో బుధవా రం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తాజా నిదర్శనం. ప్రధాన రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలపై వేలాడదీసిన డిష్ కేబుల్ వైర్లు ప్రమాదవశాత్తు 11కేవీ హైటెన్షన్ లైన్లకు తగిలి తీవ్ర రాపిడికి గురై తెగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక యువకుడు పడిగెల భరత్ పై విద్యు త్ సరఫరా అవుతున్న కేబుల్ వైర్ పడటంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై విలవిల్లాడాడు.స్పందించిన స్థానికులు – దక్కిన ప్రాణం: షాక్‌కు గురై ప్రాణా పాయ స్థితిలో ఉన్న భరత్‌ను గమనించిన స్థానిక విలేకరి రామ్మూర్తి అత్యంత ధైర్యసాహసాలతో, సమయస్ఫూర్తితో స్పందించారు. స్థానికులను సమన్వయం చేసుకుంటూ వెంటనే విద్యుత్ సర ఫరా నుంచి భరత్‌ను రక్షించి, వాహనంలో హుటా హుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లో స్పందించి యువకుడి ప్రాణాలను కాపా డిన విలేకరి రామ్మూర్తిని గ్రామస్తులు, స్థానిక నాయ కులు కొనియాడారు.అనుమతులు ఎవరిచ్చారు? నియంత్రణ ఎక్కడ? అసలు విద్యుత్ శాఖ నిబంధ నల ప్రకారం 11కేవీ హైటెన్షన్ లైన్లు వెళ్లే స్తంభాలపై ప్రైవేట్ కేబుల్, ఇంటర్నెట్ వైర్లు అమర్చడం చట్టరీ త్యా నేరం.విద్యుత్ స్తంభాలపై అనుమతులు లేకుండా కేబుళ్లు లాగుతుంటే అధికారులు ఎందు కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు?నెల వారీ చందాలు వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రత, నిర్వహణపై కేబుల్ నిర్వాహకులకు లేదా? గాలివాన వచ్చినా, ఎండ తీవ్రత పెరిగినా హైటెన్షన్ వైర్లకు తగిలేలా వైర్ల గుట్టలు వేలాడుతు న్నా సంబంధిత శాఖ లైన్‌మెన్లు, ఏఈలు ఎందుకు పర్యవేక్షించడం లేదు?వైర్ల వ్యవస్థకు స్వస్తి పలకా లి – సెటప్‌బాక్స్‌లే పరిష్కారం: పట్టణాలు, గ్రామా ల్లో ప్రమాదకరంగా మారిన తీగల వ్యవస్థకు శాశ్వ త పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తు న్నారు. స్తంభాల గుండా అడ్డదిడ్డంగా లాగే కేబుల్ వైరింగ్ వ్యవస్థను పూర్తిగా నిషేధించి, కేవలం డిజి టల్ సెటప్‌బాక్స్ (డిటీఎచ్ / శాటిలైట్ కనెక్ష న్లు) ఆధారిత సేవలనే అనుమతించాలని స్థాని కులు స్పష్టం చేస్తున్నారు. వైర్ల జంఝాటం లేకుం డా శాటిలైట్ సెటప్‌బాక్స్‌లను తప్పనిసరి చేస్తే ఇలాం టి విద్యుత్ ప్రమాదాలను ముందస్తుగానే అరికట్ట వచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ యంత్రాం గం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి. విద్యుత్ స్తంభాలపై నిబంధనలకు విరు ద్ధంగా ఉన్న ప్రైవేట్ కేబుల్ వైర్లను వెంటనే తొల గించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు జిల్లా ప్రజలు.

.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.