భువనేశ్వర్/జయపురం,ఆగస్టు 27, ఒడిశా ప్రతినిధి : తెలంగాణ లోని జగిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన ఐపీఎస్ అధికారి అనుగు శివ మారుతి రెడ్డి ఒడిశా గవర్నర్‌కు ఏడ్-డి-క్యాంప్(ఏడీసీ)గా నియమితుల య్యారు. ఆయన గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి అనన్య అవస్థి స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022లో నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో శివ మారుతి రెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 132 సాధించారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి 2020లో ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. రెండో ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తమ ర్యాంక్ సాధించి, ఒడిశా కేడర్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా ఎంపికయ్యారు. తాజాగా గవర్నర్ ఏడీసీగా నియామకం పొందడంతో ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.


