నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏడుగురు దివ్యాంగులకు రూ.56 వేల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ పుల్లయ్య (విజువల్లీ ఛాలెంజ్డ్) సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అంధత్వాన్ని అధిగమించి బ్యాంకు ఉద్యోగం సాధించడమే కాకుండా, దివ్యాంగుల కోసం రూ.56 వేలు విరాళంగా అందించిన పుల్లయ్యను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. దివ్యాంగుల సంక్షేమానికి, అవసరమైన ఉపకరణాలు, మందుల పంపిణీకి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఏడుగురు దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ
నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏడుగురు దివ్యాంగులకు రూ.56 వేల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ పుల్లయ్య (విజువల్లీ ఛాలెంజ్డ్) సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంధత్వాన్ని అధిగమించి బ్యాంకు ఉద్యోగం సాధించడమే కాకుండా, దివ్యాంగుల కోసం రూ.56 వేలు విరాళంగా అందించిన పుల్లయ్యను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. దివ్యాంగుల సంక్షేమానికి, అవసరమైన ఉపకరణాలు, మందుల పంపిణీకి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్, కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

