Sunday, 30 August 2026
  • Home  
  • ఏటికొప్పాక జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం
- అనకాపల్లి

ఏటికొప్పాక జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం

తెలుగు వెలుగు.. క్రీడా స్ఫూర్తి! యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లా రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి, భారత క్రీడా రంగానికి చిరస్మరణీయ సేవలందించిన మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఊడి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, విద్యార్థులు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని సూచించారు. అలాగే చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భాషాభిమానం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా సాగింది.

తెలుగు వెలుగు.. క్రీడా స్ఫూర్తి!

యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లా రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలుగు భాషకు విశేష సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి, భారత క్రీడా రంగానికి చిరస్మరణీయ సేవలందించిన మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పాఠశాల చైర్మన్ ఊడి రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఊడి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, విద్యార్థులు మాతృభాషపై అభిమానం పెంచుకోవాలని సూచించారు. అలాగే చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని అన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో భాషాభిమానం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.