ఏఎస్పేట: దర్గా సెంటర్ సమీపంలోని నగారా ఖాన్ సెంటర్లో రాత్రివేళ కొందరు యువకులు బీరు బాటిళ్లతో హల్చల్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. మజహార్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు డిమాండ్ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్ఐ షేక్ జిలాని తెలిపారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ఘటనలో పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజలకు భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ జిలాని హెచ్చరించారు.

ఏఎస్పేటలో కత్తితో బెదిరింపులు.. నలుగురికి రిమాండ్