Thursday, 3 September 2026
  • Home  
  • ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి – CITU డిమాండ్
- నిర్మల్

ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి – CITU డిమాండ్

నిర్మల్, సెప్టెంబర్ 03: వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తగ్గించాలని, ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించి పెండింగ్ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఖర్చుతో ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించాలని, అర్హత కలిగిన ఏఎన్‌ఎంలకు సూపర్‌వైజర్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 1,931 ఎంపిహెచ్‌ఏ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నియామకాల్లో మిగిలి పోయిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఏఎన్‌ఎంలందరికీ వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఆభా లింకింగ్ విధానాన్ని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ Anm యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మీ, రాధా, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్, సెప్టెంబర్ 03:

వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తగ్గించాలని, ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించి పెండింగ్ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఖర్చుతో ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించాలని, అర్హత కలిగిన ఏఎన్‌ఎంలకు సూపర్‌వైజర్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 1,931 ఎంపిహెచ్‌ఏ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నియామకాల్లో మిగిలి పోయిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఏఎన్‌ఎంలందరికీ వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఆభా లింకింగ్ విధానాన్ని తొలగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సెకండ్ Anm యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మీ, రాధా, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.