యలమంచిలి : సెప్టెంబర్ 7 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన యలమంచిలి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయిని సారిక సుజాతను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సోమవారం పాఠశాల ఆవరణలో హెచ్ఎం సుశీల ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాతను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల హెచ్ఎం సుశీల మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికి అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న సారిక సుజాత జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడం తమ పాఠశాలకే గర్వకారణమని కొనియాడారు. ఆమె సేవలు తోటి ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం అవార్డు గ్రహీత సారిక సుజాత మాట్లాడుతూ.. తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంలో సహకరించిన హెచ్ఎం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


