Friday, 4 September 2026
  • Home  
  • ఇంకో 2 నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. అంతలోనే కబళించిన మృత్యువు!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంకో 2 నిమిషాల్లో ఇంటికి చేరేవారు.. అంతలోనే కబళించిన మృత్యువు!

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం లక్కవరం శివారులోని ఓఎన్‌జీసీ సైట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరానికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్కవరానికి చెందిన ముదునూరి రామభద్రరాజు, ఆయన తమ్ముడు వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న వారి భార్యలు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటికి చేరువలో జరిగిన ఈ విషాద ఘటనతో లక్కవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం లక్కవరం శివారులోని ఓఎన్‌జీసీ సైట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
భీమవరం నుంచి స్వగ్రామం లక్కవరానికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరిచెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్కవరానికి చెందిన ముదునూరి రామభద్రరాజు, ఆయన తమ్ముడు వెంకటసుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ఉన్న వారి భార్యలు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇంటికి చేరువలో జరిగిన ఈ విషాద ఘటనతో లక్కవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.