*నందిపేట్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రాజ్నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ వద్ద ఏర్పాటు చేస్తున్న వెర్టికల్ సోక్ పిట్ పనులకు నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.*
*వెర్టికల్ సోక్ పిట్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల (Ground Water) పెరుగుదలకు దోహదపడుతుంది. భవిష్యత్లో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం.*
*ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.*
*గ్రామ అభివృద్ధి – నీటి సంరక్షణే మన లక్ష్యం.*



