అరకులోయ మండలం మాదల గ్రామపంచాయతీలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ నిశాంతి టి., ఐఏఎస్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజా శ్రీధర్, ఎంఈఓ భారతిరత్నం, డీటీడబ్ల్యూ వెంకట్రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణలత, పీడీఓ కే. శైలజ పాల్గొన్నారు.
ప్రజల నుంచి మొత్తం 30 వినతులు అందాయి. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్–5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్–5, ఆర్డబ్ల్యుఎస్ఎస్–4, స్పెషల్ మైనర్ ఇరిగేషన్–3, స్కూల్ ఎడ్యుకేషన్–2, సివిల్ సప్లైస్–2, విద్యుత్ శాఖ–3, వ్యవసాయ శాఖ–3, రెవెన్యూ–2, పంచాయతీరాజ్–3 ఉన్నాయి. వినతులను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

అరకు: మాదల పీజీఆర్ఎస్కు 30 వినతులు
అరకులోయ మండలం మాదల గ్రామపంచాయతీలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ నిశాంతి టి., ఐఏఎస్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ వీసం ప్రసాద్, తహసీల్దార్ జి. రాజా శ్రీధర్, ఎంఈఓ భారతిరత్నం, డీటీడబ్ల్యూ వెంకట్రావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వర్ణలత, పీడీఓ కే. శైలజ పాల్గొన్నారు. ప్రజల నుంచి మొత్తం 30 వినతులు అందాయి. వీటిలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్–5, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్–5, ఆర్డబ్ల్యుఎస్ఎస్–4, స్పెషల్ మైనర్ ఇరిగేషన్–3, స్కూల్ ఎడ్యుకేషన్–2, సివిల్ సప్లైస్–2, విద్యుత్ శాఖ–3, వ్యవసాయ శాఖ–3, రెవెన్యూ–2, పంచాయతీరాజ్–3 ఉన్నాయి. వినతులను సంబంధిత శాఖలకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

