Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

బంగారు తిరుచ్చిపై శ్రీ సూర్యనారాయణుడి అభయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బంగారు తిరుచ్చిపై శ్రీ సూర్యనారాయణుడి అభయం

వార్త ముఖ్యాంశాలు

  • తిరుచానూరు, ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి సోమవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.
  • శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మనక్షత్రమైన హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అహంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • హస్త నక్షత్రం సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు.

తిరుచానూరు, ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి సోమవారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మనక్షత్రమైన హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అహంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హస్త నక్షత్రం సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని విశేషముగా అలంకరించి, ఉంజల్ సేవా నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చి పై కొలువు దీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయులు, సురేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *