అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హర్ ఘర్ తిరంగ ర్యాలీ, పచ్చదనం ప్రాముఖ్యత కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్ధినిలు కళాశాల నుండి పానిరంగిని గ్రామం వరకు ర్యాలీ చేపట్టి ఇళ్ళపై జెండా ఎగురవేయాలని నినదించారు. అనంతరం పచ్చదనం ప్రాముఖ్యత పై విద్యార్ధినిలకు అటవీ శాఖ అరకు ఎఫ్ఆర్ఓ కోటేశ్వరరావు అవగాహన కల్పించి, కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డా కుసుమకుమారి, అధ్యాపకులు, విద్యార్ధినిలతో మొక్కలు నాటించారు.


