అమ్మవారికి ఎంపీ రాములుప్రత్యేక పూజలు
అచ్చంపేట, సెప్టెంబరు 3: వంగూర్ మండలం గెల్వలంబ గ్రామంలో బోనాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి, ఎంపీ పోతుగంటి రాములు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


