
అనంతపురం JNTUలోని కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆచార్య శివ కుమార్ ఏపీ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈయన ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఈ గురింపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా విద్యార్థులు, సహచర అధ్యాపకులు అందించిన ప్రోత్సాహానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

