Wednesday, 9 September 2026
  • Home  
  • అక్రమ అరెస్ట్‌కు గుర్తుగా 53 దీపాలతో ‘నిజం గెలిచింది’: కిడారి శ్రావణ్
- అల్లూరి సీతారామరాజు

అక్రమ అరెస్ట్‌కు గుర్తుగా 53 దీపాలతో ‘నిజం గెలిచింది’: కిడారి శ్రావణ్

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్, గాజువాక పరిశీలకులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ 53 రోజుల జైలు నిర్బంధానికి గుర్తుగా 53 దీపాలు వెలిగించారు. కిడారి శ్రావణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయమని, అర్థరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు నిర్బంధించినా ప్రజల మద్దతు ఆయనకే ఉందని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ‘నాడు చీకట్లోకి నెట్టాలని చూసినా నేడు 53 దీపాల వెలుగుతో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది’ అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్, గాజువాక పరిశీలకులు కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ 53 రోజుల జైలు నిర్బంధానికి గుర్తుగా 53 దీపాలు వెలిగించారు.

కిడారి శ్రావణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయమని, అర్థరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు నిర్బంధించినా ప్రజల మద్దతు ఆయనకే ఉందని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

‘నాడు చీకట్లోకి నెట్టాలని చూసినా నేడు 53 దీపాల వెలుగుతో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది’ అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.