ఖమ్మం జులై
పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి జిల్లా రిపోర్టర్ )
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, హార్టికల్చర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
నగరంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన చెత్తకుండీల వివరాలను అడిగి తెలుసుకున్న కమిషనర్, ఇంకా అవసరమైన ప్రాంతాలను గుర్తించి చెత్తకుండీలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ, చెత్త సకాలంలో తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించ



