Saturday, 4 July 2026
  • Home  
  • ప్రో యాక్టివ్‌గా పని చేయండి.. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
- జయశంకర్ భూపాలపల్లి

ప్రో యాక్టివ్‌గా పని చేయండి.. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

• సేవల్లో జిల్లాలను ఆదర్శంగా నిలపాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. • జిల్లా కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉంటూ క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలి • వైద్య, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక కృషి అవసరం. •ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. • ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ విజయవంతంపై కలెక్టర్లకు అభినందనలు. భూపాలపల్లి ( పున్నమి న్యూస్ ) జులై 4 : అన్ని జిల్లాల కలెక్టర్లు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి, ప్రజా సేవలో జిల్లాలను ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల వైవిధ్యీకరణ, రైతు రిజిస్ట్రీ, త్రాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యాన పంటలు సాగు, సూక్ష్మ సాగునీరు, ఆయిల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, అధికారులు అందరూ సమన్వయంతో విధులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాల మేర ఆశించిన మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. పాలనలో సంస్కరణలు, మార్పులతో పాటు సృజనాత్మకమైన పనితీరు కనిపించాలని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు. తక్కువ నీటితో పండే వర్షాభావ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నీటి వృథాను అరికట్టేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆదేశించారు. విద్యా, వైద్య ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్లు స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్లను తదితర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను నిరంతరం తనిఖీ చేస్తూ ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానాలు రూపకల్పన చేసి అమలు చేయాలన్నారు. జిల్లాలలో పర్యాటక ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని గ్రామ స్థాయు నుండి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లను, యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. ఇప్పటికే 510.93 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని 68 మందిని అరెస్టు చేసి, 34 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాసం వారి లక్ష్యం మేరకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని సూచించారు. రైతు రిజిస్ట్రీ కార్యక్రమంలో రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందని, అర్హులైన ప్రతి రైతు నమోదు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ వరికి ప్రత్యామ్నయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్ సాగు.పెంచాలని, ఉద్యాన పంటల అభివృద్ధి, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా చేపట్టి వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రతి కుటుంబం తప్పకుండా డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ దోమలు, లార్వా నిర్మూలనతో మురుగునీరు నిల్వలున్న ప్రాంతాలల్లో ఫాగింగ్, శుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, నిర్మాణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు చేపట్టాలని, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ తేదీలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులలో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, రెవెన్యూ శాఖలు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి నాణ్యత, పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రత, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఆహార తయారీ నుంచి పంపిణీ వరకు పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. విద్యార్థుల హాజరుకు అనుగుణంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ఆహార అవసరాలను అంచనా వేసి వ్యర్థాలను నివారించాలని తెలిపారు. ఆహార నాణ్యత, పంపిణీ, పర్యవేక్షణ కోసం డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను సమర్థంగా వినియోగించాలని, జిల్లా కలెక్టర్లు పథకం అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వానాకాలంలో రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్ఓ వసంత కుమారి, వ్యవసాయ, వైద్య, విద్య, పంచాయతి రాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

• సేవల్లో జిల్లాలను ఆదర్శంగా నిలపాలి:
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

• జిల్లా కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉంటూ క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలి

• వైద్య, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక కృషి అవసరం.

•ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి.

• ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ విజయవంతంపై కలెక్టర్లకు అభినందనలు.

భూపాలపల్లి ( పున్నమి న్యూస్ ) జులై 4 : అన్ని జిల్లాల కలెక్టర్లు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి, ప్రజా సేవలో జిల్లాలను ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, ప్రజారోగ్యం, పంటల వైవిధ్యీకరణ, రైతు రిజిస్ట్రీ, త్రాగునీరు, ఇరిగేషన్, విద్య, వాతావరణ మార్పులు, ఉద్యాన పంటలు సాగు, సూక్ష్మ సాగునీరు, ఆయిల్ పామ్ విస్తరణ, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అన్ని
జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, అధికారులు అందరూ సమన్వయంతో విధులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాల మేర ఆశించిన మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. పాలనలో సంస్కరణలు, మార్పులతో పాటు సృజనాత్మకమైన పనితీరు కనిపించాలని స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు. తక్కువ నీటితో పండే వర్షాభావ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ రంగంలో నీటి వృథాను అరికట్టేందుకు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆదేశించారు. విద్యా, వైద్య ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్లు స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్లను తదితర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను నిరంతరం తనిఖీ చేస్తూ ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానాలు రూపకల్పన చేసి అమలు చేయాలన్నారు. జిల్లాలలో పర్యాటక ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని గ్రామ స్థాయు నుండి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లను, యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని, రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలిపారు. ఇప్పటికే 510.93 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని 68 మందిని అరెస్టు చేసి, 34 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాసం వారి లక్ష్యం మేరకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవాణా, అధిక ధరలకు విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని సూచించారు. రైతు రిజిస్ట్రీ కార్యక్రమంలో రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందని, అర్హులైన ప్రతి రైతు నమోదు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ వరికి ప్రత్యామ్నయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఆయిల్ పామ్ సాగు.పెంచాలని, ఉద్యాన పంటల అభివృద్ధి, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని 33 జిల్లాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా చేపట్టి వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రతి శుక్రవారం ప్రతి కుటుంబం తప్పకుండా డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తూ దోమలు, లార్వా నిర్మూలనతో మురుగునీరు నిల్వలున్న ప్రాంతాలల్లో ఫాగింగ్, శుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, వసతి గృహాలు, నిర్మాణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు చేపట్టాలని, గత ఏడాదితో పోలిస్తే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని, ప్రసవ తేదీలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రులలో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్య, ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ, రెవెన్యూ శాఖలు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి నాణ్యత, పాఠశాలలు, వసతి గృహాల పరిశుభ్రత, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ఆహార తయారీ నుంచి పంపిణీ వరకు పరిశుభ్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
విద్యార్థుల హాజరుకు అనుగుణంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ఆహార అవసరాలను అంచనా వేసి వ్యర్థాలను నివారించాలని తెలిపారు. ఆహార నాణ్యత, పంపిణీ, పర్యవేక్షణ కోసం డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను సమర్థంగా వినియోగించాలని, జిల్లా కలెక్టర్లు పథకం అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వానాకాలంలో రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్ఓ వసంత కుమారి, వ్యవసాయ, వైద్య, విద్య, పంచాయతి రాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.