Friday, 3 July 2026
  • Home  
  • ‘ఏం పిల్లడో ఎలా గున్నవో’ పాట విజయవంతం… బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

‘ఏం పిల్లడో ఎలా గున్నవో’ పాట విజయవంతం… బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

ఎన్.కే స్టార్ క్రియేషన్స్ అధినేత మద్దిబోయిన శేషు యాదవ్ నిర్మించిన “ఏం పిల్లడో ఎలా గున్నవో” పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా పాట విజయవంతమైనందుకు బారాషహీద్ దర్గాలో షంషుద్దీన్ గారు, జనార్ధన్ శివలంకి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిబోయిన శేషు యాదవ్ గారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు, పాటలు నిర్మించాలని ఆకాంక్షించారు. ఈ పాటకు ఎన్.ఆర్. చైతన్య కుమార్ సంగీతం అందించగా, కళ్యాణ్ రామ్ కొరియోగ్రఫీ చేశారు. హరీష్ పటేల్ డి.ఓ.పి‌గా వ్యవహరించగా, నిర్మాతగా మద్దిబోయిన శేషు యాదవ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీఏ ఉపాధ్యక్షులు ఎన్. సుధాకర్ రెడ్డి, ఒలేటి సత్య, రుద్రకోట వెంకటేశ్వర్లు, మీరాకిల్ మీరా, కిరణ్ శ్రీనివాసులు, ఎస్.కే. రషీద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎన్.కే స్టార్ క్రియేషన్స్ అధినేత మద్దిబోయిన శేషు యాదవ్ నిర్మించిన “ఏం పిల్లడో ఎలా గున్నవో” పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా పాట విజయవంతమైనందుకు బారాషహీద్ దర్గాలో షంషుద్దీన్ గారు, జనార్ధన్ శివలంకి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మద్దిబోయిన శేషు యాదవ్ గారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు, పాటలు నిర్మించాలని ఆకాంక్షించారు.

ఈ పాటకు ఎన్.ఆర్. చైతన్య కుమార్ సంగీతం అందించగా, కళ్యాణ్ రామ్ కొరియోగ్రఫీ చేశారు. హరీష్ పటేల్ డి.ఓ.పి‌గా వ్యవహరించగా, నిర్మాతగా మద్దిబోయిన శేషు యాదవ్ వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌సీఏ ఉపాధ్యక్షులు ఎన్. సుధాకర్ రెడ్డి, ఒలేటి సత్య, రుద్రకోట వెంకటేశ్వర్లు, మీరాకిల్ మీరా, కిరణ్ శ్రీనివాసులు, ఎస్.కే. రషీద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.