Sunday, 20 September 2026

Tag: భక్తి

నంద్యాల

పర్యావరణహిత వినాయక చవితికి జిల్లా యంత్రాంగం పిలుపు

నంద్యాల: వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగుల విగ్రహాలను వినియోగించకుండా మట్టి విగ్రహాలనే ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రజలకు పిలుపునిచ్చారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న నంద్యాల జిల్లా కేంద్రంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. POP విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నందున పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు పర్యవేక్షణ చేపడతారని, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

ఖమ్మం

ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి..

రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్)ను ఆగస్టు 28న శుక్రవారం జరుపుకోవాలని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. పౌర్ణమి తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. రాఖీ కట్టేందుకు ఆగస్టు 28న ఉదయం 5:57 నుంచి 9:48 గంటల వరకు శుభ సమయం ఉన్నట్లు పంచాంగ ఆధారాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 27న కాకుండా 28న సోదరులకు రాఖీ కట్టడం శుభప్రదమని సూచిస్తున్నారు. రాఖీ పౌర్ణమిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పలువురు కోరుతున్నారు.

నంద్యాల

మహానంది క్షేత్రంలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయ ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఏజీఎన్ జ్యువెలర్స్ అధినేతలు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో సామూహిక వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.గణపతి పూజ, పుణ్యాహవాచనం, వరలక్ష్మీ కలశ ప్రతిష్ఠ, అష్టాంగ పూజ, తోరపూజలు నిర్వహించి మహిళలు పరస్పరం తోరాలు కట్టుకున్నారు. అనంతరం అమ్మవారి కలశాన్ని కోనేరులో నిమజ్జనం చేశారు. పాల్గొన్న భక్తులకు దాతలు వాయనాలు, దేవస్థానం ఆధ్వర్యంలో ప్రసాదం, భోజన సదుపాయం కల్పించారు.

నంద్యాల

శ్రావణ శుక్రవారం.. శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల రాత్రికాల పల్లకి సేవ వైభవంగా

మహానంది: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ మహానందీశ్వరుల రాత్రికాల పల్లకి సేవను ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను పుష్పాలతో సుందరంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు.వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకి సేవ నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా పల్లకి సేవను దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.పల్లకి సేవ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం

నేడు వరలక్ష్మి వ్రతం

నేడు శ్రావణ మాసంలోని పవిత్రమైన శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మహిళలు సిద్ధమయ్యారు. సంపద, సౌభాగ్యం, సుఖసంతోషాలను ప్రసాదించే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసి, గడపలకు పసుపు, కుంకుమలతో అలంకరణలు చేసి, పూజా మందిరంలో కలశాన్ని ఏర్పాటు చేస్తారు. అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి, పండ్లు, పిండి వంటలు, నైవేద్యాలను సమర్పిస్తారు. వరలక్ష్మి వ్రత కథను చదివి, అష్టలక్ష్ములను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పట్టణాలు, గ్రామాల్లోని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళలు కొత్త వస్త్రాలు ధరించి, ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వాయనాలు సమర్పిస్తారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది.

నంద్యాల

వెంకటేష్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం

నంద్యాల: విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నంద్యాలలో వెంకటేష్ అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వెంకటేష్ అభిమాన సంఘం నంద్యాల అధ్యక్షుడు వేణుతో పాటు రాఘవ, జాకీర్, సుధాకర్, శేషు, కాశి, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

21న వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

నంద్యాల : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈనెల 21న నంద్యాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల వాస్తవ్యులు అవ్వారు గౌరీనాథ్, సరస్వతి దంపతుల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, దంపతులు పాల్గొనాలని కోరారు. పాల్గొనే వారికి అవసరమైన పూజా ద్రవ్యాలతో పాటు దేవస్థానం తరఫున ముత్తైదువాయనం అందజేస్తామని తెలిపారు.వ్రతంలో పాల్గొనదలచిన వారు ఉదయం 10.30 గంటలకు ఆలయం లోపల ఉండాలని సూచించారు.

నంద్యాల

ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానానికి రూ.6 లక్షల విరాళం : గోళ్ళ రాజేష్

నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరీ సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గోళ్ల రాజేష్ రూ.6 లక్షల విరాళం అందించారు. దేవస్థాన చైర్మన్ చలం బాబుకు విరాళం చెక్కును అందజేశారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి, నూతన నిర్మాణాలు, అన్నదాన సత్రం, భక్తుల వసతి గృహాల పనులను పరిశీలించిన రాజేష్, భవిష్యత్తులోనూ మరింత ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, చైర్మన్ చలం బాబు గోళ్ల రాజేష్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు

నంద్యాల

నంద్యాలలో ఘనంగా నాగులచవితి వేడుకలు పుట్టలకు పోటెత్తిన భక్తజనం.. పాలు పోసి ప్రత్యేక పూజలు

నంద్యాల : నాగులచవితి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లోని నాగుల పుట్టల వద్దకు భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు.కోదండరామాలయం, చెరువు కట్ట, ఎస్‌బీఐ కాలనీ, ఎంజీఓస్ కాలనీ, బస్టాండ్, బొమ్మలసత్రం తదితర ప్రాంతాల్లో పుట్టలకు పాలు పోసి చలిమిడి, వడపప్పు, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాగేంద్రస్వామిని ప్రార్థించారు.కానాల గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనూ నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

నంద్యాల

కానాల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వైభవంగా నాగులచవితి వేడుకలు

నంద్యాల మండలం కానాల గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో నాగులచవితి వేడుకలు వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రస్వామి పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పాలు పోశారు. చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ప్రార్థించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.