Sunday, 20 September 2026

Tag: భక్తి

నంద్యాల

శ్రావణ తొలి శుక్రవారం కామేశ్వరీ అమ్మవారికి విశేష పూజలు

నంద్యాల: శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ కామేశ్వరీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు.ఈ సందర్భంగా అమ్మవారిని 13 పట్టుచీరలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఆలయ మండపాలు, స్తంభాలు తదితర ప్రాంతాలను కలిపి సుమారు 100 చీరలతో సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగురంగుల చీరల అలంకరణతో అమ్మవారి సన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువైన శ్రీ కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

నంద్యాల

మహానంది క్షేత్రంలో శ్రావణ తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు

మహానంది క్షేత్రంలోని శ్రీ కామేశ్వరీ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు అమ్మవారి అనుగ్రహం కల్పించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా ఆగస్టు 14న అమ్మవారికి విశేష ద్రవ్యాభిషేకం, పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ, చండీహోమం, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన వారణాసి రామ్మోహన్‌రావు, విజయలక్ష్మి దంపతులు సహకరిస్తున్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కామేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆలయ అధికారులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.