నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరీ సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గోళ్ల రాజేష్ రూ.6 లక్షల విరాళం అందించారు. దేవస్థాన చైర్మన్ చలం బాబుకు విరాళం చెక్కును అందజేశారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి, నూతన నిర్మాణాలు, అన్నదాన సత్రం, భక్తుల వసతి గృహాల పనులను పరిశీలించిన రాజేష్, భవిష్యత్తులోనూ మరింత ఆర్థిక సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, చైర్మన్ చలం బాబు గోళ్ల రాజేష్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు

ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానానికి రూ.6 లక్షల విరాళం : గోళ్ళ రాజేష్