Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: పొలిటికల్

ఖమ్మం

24 వ తేదీ న ఓరుగంటి క్రిష్ణయ్య దశదిన కర్మ

పెనుబల్లి /ఖమ్మం బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు ఓరుగంటి రాము తండ్రి ఓరుగంటి క్రిష్ణయ్య దశదిన కర్మ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెనుబల్లి మండలం మాండాలపాడు గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. బంధుమిత్రులు, సన్నిహితులు కార్యక్రమానికి హాజరై ఓరుగంటి క్రిష్ణయ్యకు నివాళులు అర్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.

ఖమ్మం

విద్యా వ్యవస్థలోనూ కీలక సంస్కరణలు అవసరం: బొర్రా భాను ప్రకాష్

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి హత్య ఘటన చాలా బాధాకరమైన విషయమని ఋగ్వేదం పాఠశాల కరస్పాండెంట్ బొర్రా భాను ప్రకాష్ అన్నారు. ఈ ఘటనపై స్పందించినప్పుడు తనకు మొదటగా కలిగిన భావన.. ప్రస్తుత విద్యా వ్యవస్థలోనూ కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా విధానంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల మానసిక స్థితిని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని, వారితో ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో భయాన్ని కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధనా విధానాలను అనుసరించాలన్నారు. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని బొర్రా భాను ప్రకాష్ ‘పున్నమి’ ప్రతినిధితో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఖమ్మం

పిల్లలపై ప్రేమే పాఠం.. బెదిరింపులు కాదు: తల్లిదండ్రుల ఆవేదన

ఖమ్మం: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు చిన్నారులను ప్రేమ, ఆప్యాయతలతో దగ్గరకు తీసుకుని, వారికి అర్థమయ్యే రీతిలో నచ్చజెప్పి చదువుపై ఆసక్తి పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. హోంవర్క్, క్లాస్‌వర్క్ చేయలేదని పిల్లలపై కోపం, బెదిరింపులు ప్రదర్శిస్తే వారు భయాందోళనలకు గురై తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ వేతనాలకు పనిచేస్తారని కనీస విద్యార్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నారులను ఎలా గైడ్ చేయాలో, వారి మానసిక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చన్నారు. B.Ed. అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా శాస్త్రంతో పాటు పిల్లల మానసిక స్థితిపై అవగాహన ఉంటుందని, ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

ఖమ్మం

డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయండి: రక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ గోంగూర వెనకటేశ్వర్లు పిలుపు.

ఖమ్మంనగరంలోని 24వ డివిజన్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో నషాముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత, బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.), పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలనందం, ASR జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గోవిందు రావు, 3H ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ ఎంతో కీలకమని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. కార్యక్రమంలో గజ్జెల శ్రీనివాస్, ఆత్మకూరి నాగేశ్వరరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నషాముక్త్ సమాజం కోసం అందరూ కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

గురువును తల్లిదండ్రులతో సమానంగా గౌరవించాలి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్

సత్తుపల్లి /ఖమ్మం నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన అత్యంత దారుణమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు సరైన మార్గం చూపించే గురువులు తల్లిదండ్రులతో సమానమని అన్నారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ఉపాధ్యాయులు మందలించడం వారి బాధ్యతలో భాగమేనని పేర్కొన్నారు. గురువు మందలింపును కక్షగా భావించి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం బాధాకరమన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం, చెడు స్నేహాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని కోరారు. గురువులను గౌరవించడం అంటే విద్య, జ్ఞానం, భవిష్యత్తును గౌరవించడమేనని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో KKC ఖమ్మం జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్, కేకేసి ఆటో యూనియన్ అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట నాయుడు, నగర అధ్యక్షులు బి. సతీష్, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్. రాజు, KKC జిల్లా కమిటీ సభ్యులు, యూనియన్ నాయకులు వీర గౌడ్, నాగేంద్రబాబు, లక్ష్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశంలో యువతకు ప్రాధాన్యత, సాంకేతిక రంగానికి ప్రోత్సాహం, ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణకు KKC కృషి చేస్తుందని తెలిపారు. రాజీవ్ గాంధీ సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఖమ్మం

ఆగస్టు 24 నుంచి ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్ ఏడాదికి రూ.12 వేల జీవనభృతి చెల్లించాలి: జేఏసీ

ఖమ్మం: ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24 నుంచి బంద్ చేపట్టాలని ఖమ్మం జిల్లా జేఏసీ పిలుపునిచ్చింది. BRTU కార్యాలయంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ సత్తార్ మియా అధ్యక్షతన సమావేశం జరిగింది. BRTU గౌరవ అధ్యక్షులు పగడాల నాగరాజు, AIRTWF-CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడారు. ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల జీవనభృతి, ప్రత్యేక సంక్షేమ బోర్డు, అనువైన ప్రాంతాల్లో అడ్డాలు, రూ.10 లక్షల ఇన్సూరెన్స్, టి-యూ యాప్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాపిడో, ఓలా, ఉబర్ వల్ల కార్మికులు నష్టపోతున్నారని, 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సమావేశంలో INTUC మోటార్ రంగం అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, AIRTWF-CITU జిల్లా కార్యదర్శి ఉపేందర్, AITUC అధ్యక్షులు పేరబోయిన మోహన్‌రావు, TNTUC రవీందర్, TUCI శ్రీనివాస్, BRTU జిల్లా అధ్యక్షులు ఎం.డి. వై. పాషా, ఆటో యూనియన్ కార్యదర్శి జిల్లా శ్రీనివాస్, ధరావత్ రాందాస్, రావుల శ్రీనివాస్, మోరీమేకల అమరయ్య, రవీందర్ రెడ్డి, తోట నాగరాజు, ముల్లార్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

కార్మికుల సమస్యలపై PACలో విప్లవ్ కుమార్ పటేల్ గళం

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నగర అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో PAC సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏఐసీసీ తెలంగాణ కో-ఇంచార్జి సచిన్ సావంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు. KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్. విప్లవ కుమార్ పటేల్ కార్మికులు, అసంఘటిత, ఆటో కార్మికుల సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే రామదాసు నాయక్, సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గాప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

పాలేరు బీజేపీ నేతల మర్యాదపూర్వక భేటీ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణలను శ్రీధర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్, నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగుర్తి సుధాకర్, కూసుమంచి మండల అధ్యక్షులు పుణ్యవతి, ఏదులాపురం మున్సిపల్ అధ్యక్షులు నాగరాజు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధత, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాటంపై నాయకులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

ఖమ్మం

అనుమతులు లేని చర్చి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి:బిజెపి

సత్తుపల్లి/ ఖమ్మం సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరాలు, చర్చిలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయకుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె. నరసింహంకు వినతిపత్రం అందజేశారు. అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు పరిశీలించి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. RTI ద్వారా పట్టణంలోని చర్చిలు, ప్రార్థనా మందిరాల అనుమతుల వివరాలను కోరినట్లు తెలిపారు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు చట్టాలు సమానంగా వర్తించాలన్నారు. కార్యక్రమంలో సాలి శివకృష్ణ, భాస్కరణ వీరంరాజు, పాల నాగ సురేందర్ రెడ్డి, జొనబోయిన కార్తీక్, డాక్టర్ పెద్దిరాజు మంద శివ, బట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.