Sunday, 30 August 2026
  • Home  
  • విద్యా వ్యవస్థలోనూ కీలక సంస్కరణలు అవసరం: బొర్రా భాను ప్రకాష్
- ఖమ్మం

విద్యా వ్యవస్థలోనూ కీలక సంస్కరణలు అవసరం: బొర్రా భాను ప్రకాష్

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి హత్య ఘటన చాలా బాధాకరమైన విషయమని ఋగ్వేదం పాఠశాల కరస్పాండెంట్ బొర్రా భాను ప్రకాష్ అన్నారు. ఈ ఘటనపై స్పందించినప్పుడు తనకు మొదటగా కలిగిన భావన.. ప్రస్తుత విద్యా వ్యవస్థలోనూ కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయమని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా విధానంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల మానసిక స్థితిని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని, వారితో ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో భయాన్ని కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధనా విధానాలను అనుసరించాలన్నారు. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని బొర్రా భాను ప్రకాష్ ‘పున్నమి’ ప్రతినిధితో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి హత్య ఘటన చాలా బాధాకరమైన విషయమని ఋగ్వేదం పాఠశాల కరస్పాండెంట్ బొర్రా భాను ప్రకాష్ అన్నారు. ఈ ఘటనపై స్పందించినప్పుడు తనకు మొదటగా కలిగిన భావన.. ప్రస్తుత విద్యా వ్యవస్థలోనూ కొన్ని కీలకమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయమని తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా విధానంలో అవసరమైన మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా నైతిక విలువలు, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నారుల మానసిక స్థితిని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని, వారితో ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో భయాన్ని కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా బోధనా విధానాలను అనుసరించాలన్నారు. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని బొర్రా భాను ప్రకాష్ ‘పున్నమి’ ప్రతినిధితో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.