Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి రాక

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రజిని సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక్కడి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన 200 కోట్లకు పైగా పెండింగ్ బిల్లుల విడుదలపై ఫైనాన్స్ అధికారులతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తితో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో సిరిసిల్లలో సభ ఏర్పాటు చేసి టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వరాలు ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి రాక

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రజిని సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక్కడి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన 200 కోట్లకు పైగా పెండింగ్ బిల్లుల విడుదలపై ఫైనాన్స్ అధికారులతో సీఎం చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరల ఉత్పత్తితో కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న నేపథ్యంలో సిరిసిల్లలో సభ ఏర్పాటు చేసి టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి సీఎం వరాలు ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి

రాజన్న సిరిసిల్ల

రాజన్న ఆలయంలో ప్రత్యేక గణపతి మండపం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల 14 తేదీ నుంచి 23 వరకు పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి భక్తుల దర్శనార్థం శ్రీ భీమేశ్వర స్వామి మండపంలో ప్రత్యేక గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు

రాజన్న సిరిసిల్ల

విద్యుత్ సమస్యకు పరిష్కారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద విద్యుత్ సమస్య పరిష్కారానికి నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు దీంతో విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు తొలగి మెరుగైన సేవలు అంద ను నాయని తెలిపారు సమస్య పరిష్కారానికి కృషిచేసిన నాయకులు విద్యుత్ శాఖ అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సెస్ డైరెక్టర్ కృష్ణ హరి ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

సీతారాం ఏచూరి కి ఘన నివాళి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో శనివారం సీతారాం ఏచూరి స్మృతి సభ నిర్వహించారు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఏచూరి చేసిన సేవలు చీర స్మరణీయమని ఆయన చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకమని ఎలిగేటి రాజశేఖర్ అన్నారు

రాజన్న సిరిసిల్ల

పక్క ప్రణాళికతో చదివితే విజయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పక్క ప్రణాళికతో చదివి విజయాన్ని సాధించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు శనివారం సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు బలహీన సబ్జెక్టులపై ప్రత్యేక అనుగుణంగా ప్రిపరేషన్ చేయాలన్నారు సమయపాలన క్రమశిక్షణతో పాటు ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు

రాజన్న సిరిసిల్ల

రైస్ మిల్లర్ల ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో ఆందోళన చేపట్టారు కల్యాణ లక్ష్మి గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు సీఎంఆర్ ఒప్పందాలు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు కోరారు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అకస్మిక దాడులు నిలిపివేసి ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు

రాజన్న సిరిసిల్ల

తేజస్విన్ వర్మకు అరుదైన అవకాశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకు చెందిన సిరిగిరి తేజస్విన్ వర్మ ప్రతిష్టాత్మక ఇస్రో శిక్షణకు ఎంపికయ్యారు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తేజస్విన్ కు వి ఎస్ ఎస్ సి అధికారులు ఆఫర్ లెటర్ అందించారు ఎంపికపై కుటుంబ సభ్యులు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు

రాజన్న సిరిసిల్ల

ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 దసరా దీపావళి పండగల సందర్భంగా తిరుపతి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైలు సర్వీసులను మరో రెండు నెలలు పొడిగించింది నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ స్టేషన్లో ఈ రైలు నిలుస్తాయి

రాజన్న సిరిసిల్ల

ఉచిత కుట్టు మిషన్లకు భారీ స్పందన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా TG ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకానికి భారీ స్పందన లభిస్తుంది ఇప్పటివరకు రెండు లక్షల 90 వేల దరఖాస్తులకు ఈనెల 15వ తేదీ చివరి గడువు అనంతరం మండలాల్లో ఎంపీడీవోలు మున్సిపాలిటీలో కమిషనర్లు పరిశీలన చేపడతారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితా రూపొందించి ఎంపికైన వారికి 12 వేల రూపాయల విలువైన కుట్టు మిషన్ ను ప్రజా ప్రతినిధుల ద్వారా అందజేయనుంది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.