Monday, 21 September 2026

Tag: గాజుల బాలాజీ. ఎల్లారెడ్డి పేట

రాజన్న సిరిసిల్ల

ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై సమీక్ష

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఎస్సీ మహేష్ బిగితే కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు అట్రాసిటీ కేసులు సంక్షేమ పథకాల అమలు రిజర్వేషన్లు ప్రజా సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు

రాజన్న సిరిసిల్ల

బద్ది పోచమ్మకు బోనాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బద్ది పోచమ్మ శీతల దేవి ఆలయాల్లో మంగళవారం భక్తుల సందడి నెలకొంది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూ లైన్ లో తాగునీరు ప్రసాద వితరణ వంటి ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో నాగుల మహేష్ పర్యవేక్షించారు

రాజన్న సిరిసిల్ల

బ్లాక్ మ్యాజిక్ పేరుతో ప్రజలకు వల

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లాక్ మ్యాజిక్ పేరుతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరినీ సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు ఈ వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు కరీంనగర్ కు చెందిన తూర పా శ్యాం కుమార్ వేములవాడ అర్బన్ మండలం అగ్రహానికి చెందిన లక్ష్మి రాజ్యమును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యుడు రాంబాబు నాయక్ మంగళవారం దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప్ నవీన్ కుమార్ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు

రాజన్న సిరిసిల్ల

నేత్రదానంతో మరొకరికి చూపు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు నేత్రదానం ప్రాముఖ్యత అపోహలు ప్రయోజనాలపై వైద్యాధికారులు వివరించారు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ మరణాంతరం నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు

రాజన్న సిరిసిల్ల

కాటన్ చీరల కార్మికుల నిరవధిక సమ్మె

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరల తయారీ కార్మికులు ఆసాములు కూలి పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగారు సోమవారం అంబా భవాని ఫంక్షన్ హాల్ లో సమ్మెను ప్రారంభించారు కూలి ఒప్పందం ముగిసి 30 నెలలు గడిచిన పెంపు జరగలేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు

రాజన్న సిరిసిల్ల

భీమేశ్వరుడికి ప్రత్యేక పూజలు మౌనిక యాదవ్

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ గాయని మౌనిక యాదవ్ కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు రాజన్న స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మౌనిక యాదవ్ తెలిపారు

రాజన్న సిరిసిల్ల

సెప్టెంబర్ ఒకటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను సృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 1 నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలు చేయనున్నట్లు ఎస్పి మహేష్ బి గీతే గారు తెలిపారు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు నిరసనలు సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు

రాజన్న సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేటకు కొత్త ఇన్చార్జి తహసిల్దార్ దివ్య జ్యోతి

పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట మండల ఇన్చార్జ్ తహసిల్దార్ ఆడెపు దివ్య జ్యోతిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు సోమవారం హామీ బాధ్యతలు స్వీకరించనున్నారు

రాజన్న సిరిసిల్ల

సిరిసిల్ల జేబీఎస్ మధ్య ప్రత్యేక రిజర్వేషన్ బస్సులు

పున్నమి ప్రతినిధి ఆగస్టు 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డిపో నుంచి హైదరాబాద్ జేబీఎస్ వరకు సోమవారం నుంచి ప్రత్యేక రిజర్వేషన్ ఎక్స్ప్రెస్ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు ఉదయం 5 గంటల నుంచి 8:15 గంటల వరకు ప్రతి అరగంటకు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.