Friday, 2 October 2026

Tag: ఎల్బీనగర్

రంగారెడ్డి

శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం.. 3,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ

ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుభం జువెలర్స్, సురేష్ జువెలర్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆడాళ్ల రమేష్ మాట్లాడుతూ.. గత 58 సంవత్సరాలుగా మంగీలాల్, వెన్నారామ్ చౌదరీ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగడం అభినందనీయమన్నారు. అన్నదానం ఎంతో పవిత్రమైన సేవా కార్యక్రమమని, ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక ఉత్సవాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తి పెంపొందుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గోపాల్ ముదిరాజ్

ఎల్బీనగర్: కర్మన్ఘాట్ శుభోదయం కాలనీలో బజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవ నగర్ కాలనీ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపాల్ ముదిరాజ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువుగట్టు చారి ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి పాటల కార్యక్రమాన్ని గోపాల్ ముదిరాజ్ తిలకించారు. అనంతరం భక్తులకు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలెం చంద్రశేఖర్ గౌడ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, పాలెం సతీష్ గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, పల్లె శ్రీధర్ గౌడ్, కార్తీక్ ముదిరాజ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కమిటీ సభ్యులు సల్మాన్, మదన్, నవీన్ కుమార్, అవినాష్, మధు, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రంగారెడ్డి

ప్రశాంత్‌నగర్‌లో ఘనంగా నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు

వనస్థలిపురం: ప్రశాంత్‌నగర్ కాలనీలో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ స్నేహితులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా రామారావు కేక్ కట్ చేయగా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్నేహితులు, స్థానికులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామారావును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలతో అభినందించారు. అనంతరం పరస్పరం ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామారావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. కాలనీ స్నేహితులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రశాంత్‌నగర్ కాలనీ స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు ఘనంగా పూజలు

రంగారెడ్డి జిల్లా: మాధవ్ నగర్ కాలనీ: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొనుగోటి రామ్మోహన్‌రావు–రాధిక దంపతులు, బి. సాయి రెడ్డి–మధులస దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మాధవ్ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, ముత్యాలు గారితో పాటు మహిళా సోదరీమణులు జ్యోతి రెడ్డి, నిర్మల రెడ్డి, అనిత రెడ్డి, రాధిక రావు, శోభ, సుశీల, చల్ల స్వప్న, అమల ముదిరాజ్ తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

రంగారెడ్డి

సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

వనస్థలిపురం: సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ రోడ్ నంబర్-10లో సెల్ఫ్ ఫైనాన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ మహిళలు, చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బతుకమ్మ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉత్సవాలను సందడిగా జరుపుకుంటున్నారు. ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 22న తొమ్మిదో రోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి ప్రసిద్ధ లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అనంతరం ఇంజాపూర్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. కాలనీ పెద్దలు లక్ష్మీకాంత్‌తో పాటు నిర్వాహకులు సంజీవ్, శ్రీనివాస్, వెంకట్, బిట్టు, అర్చిత్ రెడ్డి, వినోద్, పునీత్, శ్రీరామ్, జగన్, కిరణ్, వేణు తదితరులు పాల్గొంటున్నారు. యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా సహకరిస్తున్నారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

రంగారెడ్డి

సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు

ఎల్బీనగర్; మన్సురాబాద్‌లో సంభాజీ మహారాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం 2025లో ప్రారంభించిన ఈ వేడుకలను ఈ ఏడాది రెండోసారి మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, దాండియా కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో సుమారు 1,000 నుంచి 1,500 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 27న మన్సురాబాద్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లడ్డూ వేలం పాట నిర్వహించడంతో పాటు, ప్రత్యేకంగా రూ.51 టికెట్‌తో 4.5 కిలోల లడ్డూ లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో సంఘం సభ్యులు సాక్షిత్, ఖుందన్ శ్రీకరణ్, భువన్ శ్రీనివేద్, కార్తిక్, అభి, కార్తిక్ గౌడ్, శరత్, సుశీల్, కళ్యాణ్, వీర్, యుగ్, వర్షిత్, రాహుల్, నాని, ప్రసాద్, మాణికంఠ, ప్రణవ్, పవన్, సుజిత్, వివేక్, వరుణ్, సాయికిరణ్, ఓం సాయి, సంపత్, నిఖిల్, ఉదయ్, సాత్విక్ తదితరులు పాల్గొంటున్నారు.

రంగారెడ్డి

వనస్థలిపురంలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు

ఎల్బీనగర్: వనస్థలిపురం లేబర్ అడ్డలో మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత 15–20 ఏళ్లుగా కరోనా సమయంలోనూ ఎలాంటి విరామం లేకుండా స్వామివారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఈసారి భక్తుల సౌకర్యార్థం 13 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే శనివారం కుంటలో స్వామివారి విగ్రహ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు లడ్డు వేలం పాట కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతేడాది పెద్ద లడ్డు రూ.60 వేలు, చిన్న లడ్డు రూ.30 వేలకు వేలం పలికినట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్సవాల సందర్భంగా 1,500 నుంచి 1,800 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిమజ్జన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మణికంఠ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కోరారు.

రంగారెడ్డి

రాక్ టౌన్‌ కాలనీ లో ఘనంగా 24వ గణపతి నవరాత్రి ఉత్సవాలు

ఎల్బీనగర్: రాక్ టౌన్ కాలనీ లో 24వ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాక్ టౌన్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం శ్రీ లక్ష్మి గణపతి హోమం, సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టగా సుమారు 2,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, నాగోల్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మణిపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సూర్యనారాయణ, రాంచంద్రా రెడ్డి, సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, మధుసూదన్ రెడ్డి, లింగా రెడ్డి, ప్రభు, మాజీ అధ్యక్షులు రం రెడ్డి, మాధవ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సభ్యులు కొండల్ రెడ్డి, సీతారామ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, జగన్ మోహన్, నరేష్ కుమార్, వెంకట్ రెడ్డి, మహేష్ రెడ్డి తదితరులతో పాటు మహిళలు, పిల్లలు, పరిసర కాలనీల భక్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన శ్రీ బైరెడ్డి కోటి రెడ్డి, గోటేటి కుటుంబరావుకు రాక్ టౌన్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు రాక్ టౌన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

రంగారెడ్డి

ఎల్బీనగర్‌లో కాస్మోస్ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం.. ఆధునిక బ్యాంకింగ్ సేవలు స్థానికులకు మరింత చేరువ

ఎల్బీనగర్: ఎల్బీనగర్‌లో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు ఆధునిక, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లో సేవల విస్తరణలో ఎల్బీనగర్ శాఖ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కింగ్ కోటిలో రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసి నగర కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన శాఖతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

రంగారెడ్డి

ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు.. గణనాథుని లడ్డూను రూ.60 వేలకు కైవసం చేసుకున్న నరేష్

ఎల్బీనగర్: ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అనంతరం మేళతాళాల మధ్య గణనాథుని నిమజ్జనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలం పాటలో నరేష్ రూ.60 వేలతో లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ బీఎం ‘స్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. లడ్డూ వేలంలో రూ.60 వేలకు లడ్డూను దక్కించుకున్న నరేష్‌కు గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఎంలు అంజి, అభిలాష్, నరేష్, సతీష్, సలీం, హెచ్‌ఆర్ రేవంత్‌తో పాటు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.