Tuesday, 22 September 2026
  • Home  
  • ఎల్బీనగర్‌లో కాస్మోస్ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం.. ఆధునిక బ్యాంకింగ్ సేవలు స్థానికులకు మరింత చేరువ
- రంగారెడ్డి

ఎల్బీనగర్‌లో కాస్మోస్ బ్యాంక్ కొత్త శాఖ ప్రారంభం.. ఆధునిక బ్యాంకింగ్ సేవలు స్థానికులకు మరింత చేరువ

ఎల్బీనగర్: ఎల్బీనగర్‌లో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు ఆధునిక, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలే పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లో సేవల విస్తరణలో ఎల్బీనగర్ శాఖ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కింగ్ కోటిలో రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసి నగర కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన శాఖతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

ఎల్బీనగర్: ఎల్బీనగర్‌లో కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన శాఖను ఘనంగా ప్రారంభించారు.
ఖాతాదారులకు ఆధునిక, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ సచిన్ ఆప్టే, వైస్ చైర్మన్ సీఏ యశ్వంత్ కుమార్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్తి ధోలే పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా విస్తృతమైన శాఖల నెట్‌వర్క్‌తో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో సేవల విస్తరణలో ఎల్బీనగర్ శాఖ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కింగ్ కోటిలో రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసి నగర కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు.
నూతన శాఖతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి.
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.