ఎల్బీనగర్: ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అనంతరం మేళతాళాల మధ్య గణనాథుని నిమజ్జనానికి బయలుదేరారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గణనాథుని లడ్డూ వేలం పాటలో నరేష్ రూ.60 వేలతో లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ బీఎం ‘స్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. లడ్డూ వేలంలో రూ.60 వేలకు లడ్డూను దక్కించుకున్న నరేష్‌కు గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఎంలు అంజి, అభిలాష్, నరేష్, సతీష్, సలీం, హెచ్‌ఆర్ రేవంత్‌తో పాటు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



