Friday, 2 October 2026
  • Home  
  • బోగోలులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.
- ఆంధ్రప్రదేశ్

బోగోలులో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.

పున్నమి న్యూస్ బోగోలు మండల రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి. బోగోలు మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, గ్రామీణ స్వరాజ్య మార్గాలను నాయకులు కొనియాడారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడవాలని సూచించారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు ఉప్పాల మాచర్ల గారు, మాజీ ఉపసర్పంచ్ మునగాల జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు తుమ్మల రమణయ్య నాయుడు గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు నవాజ్ గారు, యూత్ అధ్యక్షులు బిజ్జం రమేష్ రెడ్డి గారు మరియు బోగోలు మండల నాయకులు, పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ బోగోలు మండల రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

బోగోలు మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం దేశానికి మహాత్మా గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, గ్రామీణ స్వరాజ్య మార్గాలను నాయకులు కొనియాడారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడవాలని సూచించారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోగోలు మండల అధ్యక్షులు ఉప్పాల మాచర్ల గారు, మాజీ ఉపసర్పంచ్ మునగాల జనార్దన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు తుమ్మల రమణయ్య నాయుడు గారు ముస్లిం మైనారిటీ అధ్యక్షులు నవాజ్ గారు, యూత్ అధ్యక్షులు బిజ్జం రమేష్ రెడ్డి గారు మరియు బోగోలు మండల నాయకులు, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.