Friday, 4 September 2026

Tag: Prathap

తిరుపతి

*దొరవారిసత్రం మండలం పాలింపాడులో విషాదం – కరెంటు స్తంభంపై వ్యక్తి మృతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమా?*

*పాలింపాడు (దొరవారిసత్రం మండలం):* దొరవారిసత్రం మండలం పాలింపాడు గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంటు స్తంభంపై పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభంపై తలక్రిందులుగా వేలాడుతున్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. *అసలేం జరిగింది?* మృతుడు విద్యుత్ పనుల నిమిత్తం స్తంభం ఎక్కగా, అప్పటికే లైన్ లో కరెంటు ఉండటంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరైన భద్రతా పరికరాలు లేకపోవడం, లైన్ మెన్ నిర్లక్ష్యంగా కరెంటు సప్లై ఆపకుండా పని చేయించడమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.