Monday, 21 September 2026

Tag: Asifabad

ASIFABAD

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా

ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు, కోచ్‌లకు ఘన సన్మానం ఉట్నూర్, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో కె.బి. కాంప్లెక్స్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంద మకరంద్ జెండా ఊపి క్రీడా ర్యాలీని ప్రారంభించారు. ఉట్నూర్ ఐ.బి. చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ కె.బి. కాంప్లెక్స్ వరకు కొనసాగింది. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన గిరిజన క్రీడా పాఠశాల, ఆసిఫాబాద్ విద్యార్థినులను ఘనంగా సన్మానించారు. అథ్లెటిక్స్ విభాగంలో ఎం. రాజేశ్వరి, ఎం. అఖిల, హ్యాండ్‌బాల్ విభాగంలో డి. నందిని, ఎ. మౌనిక, ఖో-ఖో విభాగంలో సిహెచ్. జంగుబాయి, కె. సత్యశీలలను సత్కరించారు. అదేవిధంగా గిరిజన క్రీడాకారులకు విశేష సేవలు అందిస్తూ, వారిని క్రీడల్లో తీర్చిదిద్దుతున్న అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ ఎస్. అరవింద్, ఖో-ఖో కోచ్ వాసం తిరుమల్లను శాలువా, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రేమకళ, ఏపీఓలు భాస్కర్, వసంత్, డిప్యూటీ డీఈఓ (ఏజెన్సీ) చందన్, క్రీడల అధికారులు పార్థసారథి, షేకు నిర్వహించారు. క్రీడాకారిణులు, కోచ్‌లను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ (కెబీ ఆసిఫాబాద్) జాదవ్ అంబాజీ, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ చిరంజీవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబారావు, వ్యాయామ ఉపాధ్యాయులు మీనా రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓలు విజయలక్ష్మి, సరితతో పాటు పాఠశాల అధ్యాపక బృందం అభినందించింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థుల్లో క్రీడల పట్ల మరింత ఆసక్తి, ఉత్సాహం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. – పున్నమి రిపోర్టర్

ASIFABAD

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు

అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు 879 కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు చిన్నారులకు మెరుగైన వసతులే లక్ష్యం: ఎస్ఈ ఉత్తమ్ జాడే ఆసిఫాబాద్, ఆగస్టు 29: చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆసిఫాబాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. సర్కిల్ పరిధిలోని మొత్తం 879 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు ఆయన వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్ఈ పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. దీంతో చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యా, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పారు. చిన్నారులకు పోషకాహారం తయారీ, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడాన్ని ఎన్పీడీసీఎల్ సామాజిక బాధ్యతగా భావిస్తోందని ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రం విద్యుత్ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. – పున్నమి రిపోర్టర్

ASIFABAD

మహిళా ప్రజాప్రతినిధుల వెనుక భర్తల పెత్తనం ఎందుకు?

-ప్రశ్నిస్తే కక్షలు, ఆరోపణలు.. రెబ్బనలో ప్రజాస్వామ్యానికి పరీక్ష! ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బన మండలం: మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆ పదవుల వెనుక భర్తలు లేదా కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికైనది మహిళా ప్రజాప్రతినిధి అయితే, అధికారిక నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా ఆ ప్రజాప్రతినిధే. కానీ ఆమె పేరుతో మరొకరు పాలన సాగిస్తే, అది మహిళా సాధికారతను అవమానించడమే కాదా? రెబ్బన మండలంలో మహిళా సర్పంచ్ భర్తల జోక్యం, మహిళా వార్డు సభ్యుల భర్తల పెత్తనం గురించి స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిని సమాధానాలతో ఒప్పించాల్సింది పోయి, వ్యక్తిగత ఆరోపణలు చేయడం, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం వంటి ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ప్రశ్నిస్తే తప్పా? గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? పంచాయతీ నిధులు ఎలా ఖర్చవుతున్నాయి? సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందుతున్నాయా? అనే ప్రశ్నలు అడగడం ప్రతి పౌరుడి హక్కు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన చోట వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, బెదిరింపుల వాతావరణం ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. మహిళా సర్పంచ్ లేదా వార్డు సభ్యురాలిని ప్రజలు ఎన్నుకుంటే, ఆమె వెనుక భర్త కాదు—ఆమె స్వయంగా ప్రజల ముందు నిలబడి బాధ్యత వహించాలి. మహిళా సాధికారత పేరుతో పదవి మహిళకు ఇచ్చి, నిర్ణయాధికారం మాత్రం భర్త చేతిలో ఉండటం ఏ విధమైన సాధికారత? ఈ వ్యవహారంపై స్వేరోస్ జిల్లా నాయకులు గోలేటి నాగేష్ స్పందిస్తూ, ప్రజాప్రతినిధుల అధికారిక బాధ్యతల్లో కుటుంబ సభ్యుల అనధికార జోక్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలు అడిగే ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల వాదన కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు నిజమా కాదా అన్నది సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టాలి. పదవి అంటే పెత్తనం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత. ప్రశ్నించే ప్రజలను అణచడం కాదు.. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రజాస్వామ్య ధర్మం. రెబ్బన మండలంలో ప్రజాప్రతినిధుల పాలన పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సాగాలని ప్రజలు కోరుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పేరుతో వారి భర్తలు లేదా ఇతర కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలకు అధికారులు చెక్ పెట్టాలి. లేకపోతే మహిళా సాధికారత అనే గొప్ప లక్ష్యం కేవలం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రజల గొంతును ప్రశ్నగా చూడకండి.. అది ప్రజాస్వామ్యానికి అద్దం. ప్రశ్నలకు సమాధానం చెప్పలేనీ పాలన జవాబుదారీతనం కోల్పోయిన స్థాయి అవుతుంది

ASIFABAD

తిర్యాణి మండలంలో CA ల్యాండ్స్ వివరాలు ఇవ్వాలి

తిర్యాణి, ఆగస్టు 22: మండల పరిధిలోని CA (Compensatory Afforestation) ల్యాండ్స్ వివరాలను వెల్లడించాలని కోరుతూ తిర్యాణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ (MRO)కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయంలో MROను కలిసి తమ డిమాండ్లను వివరించారు. మండలంలో మొత్తం ఎంత భూమిని CA ల్యాండ్స్‌గా గుర్తించారు, ఏయే సర్వే నంబర్లలో ఆ భూములు ఉన్నాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి అనే పూర్తి వివరాలను అందించాలని కోరారు. అటవీ భూములకు బదులుగా తీసుకున్న CA భూముల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. CA భూములకు సంబంధించిన అధికారిక వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలకు అవగాహన కలగడంతో పాటు, భూముల పరిరక్షణపై పర్యవేక్షణకు అవకాశం ఉంటుందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై MRO సానుకూలంగా స్పందిస్తూ, CA ల్యాండ్స్‌కు సంబంధించిన వివరాలను సేకరించి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

ASIFABAD

డీఎంఎఫ్‌టీ నిధులతో శ్రీ సేవాలాల్ జగదాంబ మాత ఆలయానికి నూతన షెడ్డు

తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ ఆసిఫాబాద్: కైరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడలో శ్రీ సేవాలాల్ జగదాంబ మాత మందిరం వద్ద డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (DMFT) నిధులతో నూతన షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ఆత్మారామ్ నాయక్, కైరిగూడ సర్పంచ్ సంధ్యారాణి కలిసి భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులకు, గ్రామస్థులకు సౌకర్యంగా ఉండేలా షెడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డీఎంఎఫ్‌టీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్, సునీత, జరుపుల శివాజీ, బానోత్ వసంతరావు, బానోత్ వినోద్, కున్సోత్ రమేష్, బలిరాం, ప్రభు, కాంట్రాక్టర్ పంబాల శీను తదితరులు పాల్గొన్నారు.

ASIFABAD

మడవాయిగూడలో ఉచిత మెడికల్ క్యాంప్

తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం: సర్పంచ్ దుర్గం సంధ్య రెబ్బెన మండలం: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం మడవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సంధ్య (మహేష్) ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్యాంప్‌లో గ్రామ ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన సమయంలో వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గం సంధ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MLHP ఋషిత, సర్పంచ్ దుర్గం సంధ్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, యువ నాయకుడు చల్లూరి నాగేష్, ANM తులసి, ఆశా కార్యకర్తలు నిర్మల, శకుంతల, శ్రీకాంత్ తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.

ASIFABAD

రూ.13 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన వైనం

తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం లింగాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కినట్లు సమాచారం. గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో రూ.13 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. అనంతరం కార్యదర్శిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం జన్నారం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

ASIFABAD

రెబ్బెన రెవెన్యూ కార్యాలయంపై ప్రశ్నలు.. అధికారులు ఎందుకు స్పందించడం లేదు?

2019 జూన్ హాజరు రిజిస్టర్‌లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం లేదన్న ఆరోపణ.. అదే సమయంలో తొమ్మిది మంది రైతులపై కేసుల నమోదు? రెబ్బెన, ఆగష్టు 21(పున్నమి ప్రతినిధి):కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో 2019 జూన్ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్‌లో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ సంతకం లేదన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వివిధ పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన స్పందన లేకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో 2019 జూన్ నెలలోనే తొమ్మిది మంది రైతులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం వెలుగులోకి రావడం కూడా పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఒకవైపు కార్యాలయ హాజరు రిజిస్టర్‌లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం లేదన్న అంశం, మరోవైపు అదే సమయంలో రైతులపై కేసులు నమోదయ్యాయన్న సమాచారం నేపథ్యంలో అప్పటి అధికారిక విధులు, హాజరు, ఫైళ్ల నిర్వహణ, కేసులకు సంబంధించిన ప్రక్రియపై సమగ్ర విచారణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. సంతకం లేకపోవడంపై విచారణ ఎక్కడ? హాజరు రిజిస్టర్‌లో సంతకం లేకపోవడం మాత్రమే ఉద్యోగి విధులకు హాజరుకాలేదని తుది నిర్ధారణకు సరిపోదు. అయితే ఆ కాలానికి సంబంధించిన బయోమెట్రిక్ హాజరు వివరాలు, జీతం బిల్లులు, సెలవు వివరాలు, డ్యూటీ ఆర్డర్లు, కార్యాలయ రికార్డులు, సంబంధిత ఫైళ్లలోని సంతకాలు తదితరాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది. అందువల్ల కేవలం ఆరోపణలను పట్టించుకోకుండా వదిలేయడం కాకుండా, సంబంధిత రికార్డులను పరిశీలించి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ అంశంపై రెబ్బెన తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారుల మౌనం కారణంగా డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కాకుండానే జీతం పొందారన్న ఆరోపణలకు బలం చేకూరుతోందని కొందరు ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం ఆరోపణ మాత్రమేనని, అధికారిక విచారణలోనే వాస్తవం తేలాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ 2019 జూన్ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్‌తో పాటు జీతం చెల్లింపుల రికార్డులు, సెలవు వివరాలు, బయోమెట్రిక్ లేదా ఇతర హాజరు ఆధారాలు, డ్యూటీ కేటాయింపులు, తొమ్మిది మంది రైతులపై నమోదైన కేసులకు సంబంధించిన అధికారిక రికార్డులను పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు తప్పని తేలితే అదే విషయాన్ని అధికారికంగా ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు. “ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఆరోపణలు వచ్చినప్పుడు అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలి” అని స్థానికులు అంటున్నారు.

ASIFABAD

విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు సరికాదు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తలు, కథనాలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల భావప్రకటన హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. కేవలం ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్రభుత్వంపై విమర్శగా ఉందనే కారణంతోనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలోని అధికారుల నియామకాల్లో కుల సమీకరణాలపై ఆయన రాసిన కథనం నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వీ.ఎన్‌. భట్టితో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, సంబంధిత కథనానికి సంబంధించి ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులు ప్రభుత్వ విధానాలు, పాలనలోని లోపాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ అని, విమర్శనాత్మక జర్నలిజాన్ని క్రిమినల్‌ చర్యల ద్వారా అణచివేయకూడదనే అంశాన్ని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ASIFABAD

రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో విస్తుపోయే నిజాలు!?

2019 జూన్ హాజరు రిజిస్టర్లో డిప్యూటీ తహసీల్దార్ సంతకం గైర్హాజరు.. ఆర్టీఐ ద్వారా బట్టబయలైన బాగోతం.. నమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ ఆర్టీఐతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఎంతటి శక్తివంతమైనదో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. రెబ్బెన మండలం అగస్టు 20,పున్నమి ప్రతినిది:కొమురంభీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఒక విచిత్రమైన, అదే సమయంలో విస్తుగొలుపుతున్న వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిరోజూ కార్యాలయానికి హాజరుకావడం, రిజిస్టర్లో నంతకం చేయడం ప్రాథమిక నిబంధన. కానీ, ఓ డిప్యూటీ తహసీల్దార్ ఏకంగా ఒక నెల పాటు హాజరు రిజిస్టర్ సంతకమే చేయకుండా విధులు నిర్వహించినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతులేని చర్చకు దారితీశాయి. అసలు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతోంది? నిబంధనలను గాలికొదిలేని ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు? అనే కోణంలో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో 2019 జూన్ నెలలో జరిగిన పరిపాలనా తీరుపై ఓ బాధ్యత గల పౌరుడు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి వివరాలు కోరగా. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ కాలంలో మండలంలో విధులు నిర్వర్తించాల్సిన సదరు డిప్యూటీ తహసీల్దార్ హాజరు రిజిస్టర్ ఎక్కడా కనీసం ఒక్క సంతకం కూడా చేయలేదని మరియు 2019 25న 9 మంది రైతుల మీద కూడ కేసు వేశారు ఈ వ్యవహారం పై రెబ్బెన సిఐ కి పిర్యాదు చేసిన స్పందన లేదు అని ఆ సమాచారంలో స్పష్టమైంది. అసలు ఆ డిప్యూటీ తహసీల్దార్ ఆ సమయంలో కార్యాలయానికి వచ్చారా? లేదా? ఒకవేళ రాకపోతే ఆయన గైర్హాజరును ఎందుకు గోప్యంగా ఉంచారు? అనే దానిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంతకం లేకుండానే జీతభత్యాల చెల్లింపులపై సందేహాలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు క్రమం తప్పకుండా హాజరు నమోదు చేసుకోవడం, ఆ రిజిస్టర్ ఆధారంగానే నెలవారీ జీతాలు, ఇతర అలవెన్సులు విడుదల కావడం సాధారణ నిబంధన, మరి, హాజరు రిజిస్టర్ కనీన సంతకం కూడా చేయని నదరు డిప్యూటీ తహసీల్దార్ కి ఆ నెలకు సంబంధించిన జీతం ఎలా చెల్లించారు? నంతకం లేని పత్రాలకు ఆమోదం తెలిపి. జీతం పొందడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది కేవలం క్లర్క్ స్థాయి అజాగ్రత్తా లేక ఉన్నతాధికారుల అండతో జరిగిన మరో పెద్ద అవకతవకా అనే ప్రశ్నలకు రెవెన్యూ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణకు తీవ్ర డిమాండ్: ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2019 జూన్ నెలకు సంబంధించిన హాజరు రిజిస్టర్తో పాటు, ఆ సమయంలో కార్యాలయానికి డిప్యూటీ తహసీల్దార్ హాజరైనట్లు రుజువు చేసే మూవ్మెంట్ రిజిన్లర్లు, జీతాల బిల్లులు, ఇతర అధికారిక రికార్డులపై సమగ్రమైన ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం నామమాత్రపు విచారణతో కాలయావన చేయకుండా, ఈ అక్రమానికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను మరిచి ఇలా వ్యవహరించడం వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నడలిస్తోంది. ఆర్టీఐ ద్వారా బయటపడిన ఈ బాగోతంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర ఆనక్తికరంగా మారింది. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.