Monday, 21 September 2026

Tag: రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి

పెట్రోల్ బంక్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం వాహనాలను ఢీకొట్టి.. బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు ధ్వంసం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండలం: బాటసింగారం, భారత్ పెట్రోల్ పంప్‌లో గురువారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెట్రోల్ పోస్తున్న రెండు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పిన బస్సు పెట్రోల్ పంప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు, బాలెనో కారు దెబ్బతిన్నాయి. బస్సు ఢీకొనడంతో పెట్రోల్ పంప్‌లోని ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు తదితర పరికరాలు ధ్వంసమయ్యాయి. దీంతో పెట్రోల్ పంప్ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌పై కేసు నమోదు గురువారం ఉదయం సుమారు 10:45 గంటలకు ప్రమాదం జరిగినట్లు పెట్రోల్ పంప్ మేనేజర్ బైరూ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి

న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి… రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పి. పవన్ కుమార్

పున్నమి: రంగారెడ్డి జిల్లా: మిర్యాలగూడ నుంచి బదిలీపై వచ్చి రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ సివిల్ జడ్జి పి. పవన్ కుమార్ను సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది కిక్కర గోపీ శంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సామాజిక అంశాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, న్యాయ సహాయం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి. పవన్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి పౌరుడు న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాదాలను సాధ్యమైనంత వరకు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. “రాజీ మార్గమే రాజా మార్గం” అనే విషయాన్ని ప్రజలు గుర్తించి, అందుబాటులో ఉన్న న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సమస్యల పరిష్కారానికి తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురక్ష సేవా సంఘం క్రియాశీలక సభ్యులు, న్యాయవాదులు శ్రీమతి ఏకే పూర్ణిమ, సంగారెడ్డి జిల్లా సురక్ష ఇన్‌చార్జి శ్రీమతి హారతి, సురక్ష సభ్యులు యాకూబ్, బొడుసు పవన్ కుమార్ యాదవ్, నాగేశ్వరి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

హయత్‌నగర్‌లో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ ఘన ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా : హయత్‌నగర్‌లోని బాబాయ్ హోటల్ వెనుక, పోస్టాఫీస్ సమీపంలో లీడర్స్ క్లబ్ క్లాతింగ్ స్టోర్ నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన దుస్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రముఖ బ్రాండ్ల దుస్తులతో పాటు వివిధ రకాల షర్ట్స్, ప్యాంట్స్, సూటింగ్స్, షర్టింగ్స్ తదితర వస్త్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పారంధ యాదగిరి, కాటేపాక కృష్ణ, పారంధ నరసింగరావు, కాటేపాక స్కైలాబ్, కాటేపాక ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన వస్త్ర దుకాణం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యత, సరసమైన ధరలు, విభిన్నమైన డిజైన్లతో సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. షోరూమ్ ప్రారంభంతో స్థానికంగా వినియోగదారులకు మరింత మెరుగైన వస్త్రాల ఎంపికకు అవకాశం లభించిందని పేర్కొన్నారు.

రంగారెడ్డి

మునగనూరులో ‘మల్లికార్జున ఎంజీ1 భూమి’ ఈవీ షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్

పున్నమి: రంగారెడ్డి జిల్లా: మునగనూరు, మునగనూరు–తొర్రూర్ రోడ్డులో ఎంజీ1 భూమి సంస్థకు చెందిన ‘మల్లికార్జున ఎంజీ1 భూమి ఈవీ షోరూమ్’ నూతనంగా ప్రారంభమైంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి, ఎంజీ1 భూమి చైర్మన్ అండ్ ఎండీ కోత మనోహర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి యాది రెడ్డి, మల్రెడ్డి అభిషేక్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వేముల అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈవీ షోరూమ్‌లో వివిధ రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు కరెడ్ల ఎల్ల రెడ్డి సుజాత గార్ల కుమార్లలు వరు కారెడ్ల సానిత్ రెడ్డి, కరెడ్ల అముల్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఈవీ వాహనాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులు షోరూమ్‌ను సందర్శించి వాహనాలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

గౌరెల్లిలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి: అబ్దుల్లాపూర్మెట్ మండలం: గౌరెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ కేంద్రాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి వెంకటస్వామి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో కాఫీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కాఫీ, అల్పాహార సేవలను అందించేలా నూతన కాఫీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాఫీ కేంద్ర నిర్వాహకులు గ్యార వీరస్వామి, చెంచల నాగరాజు, పురం శేఖర్‌రెడ్డి, మునుకుంట్ల శేఖర్‌గౌడ్, గ్యార బాల నరసింహ, చెట్టి గారి కిరణ్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన ఫిల్టర్ కాఫీతో పాటు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, నిర్వాహకుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

డాక్టరేట్ అవార్డు అందుకున్న రేవల్లే మదన్‌కు ఘన సన్మానం

అబ్దుల్లాపూర్ మెట్ మండలం: (పున్నమి ప్రతినిధి) సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు, ట్రీస్ సొసైటీ చైర్మన్ రేవల్ల మదన్ ఇటీవల డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్భంగా పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్, హయత్‌నగర్‌లో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, మిత్రబృందం సమక్షంలో రేవల్లే మదన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్, ప్రముఖ ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి చేతుల మీదుగా రేవల్లే మదన్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, సమాజ సేవకు అంకితమై నిస్వార్థంగా పనిచేస్తున్న రేవల్లే మదన్‌కు డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయమని అన్నారు. యువత, విద్యార్థులు కూడా సేవా భావాన్ని అలవర్చుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. సన్మానం అందుకున్న రేవల్లె మదన్ మాట్లాడుతూ, తన సామాజిక సేవలను గుర్తించి సన్మానించిన పుల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యానికి, డైరెక్టర్ నరసింహారెడ్డికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ సమాజ సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడాల సందీప్ ముదిరాజ్, గన్నోజి శివకుమార్, కె. ఆనంద్ కుమార్, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మహేష్ గౌడ్, టి. మల్లేష్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

బాధితునికి అండగా బీఎస్పీ, అనుమతులు లేకుండా గణేష్ మండప నిర్మాణం చేపట్టడంపై చర్యలు తీసుకోవాలి

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తుర్కయాంజల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ పట్నం రమేష్ కురుమ ఆధ్వర్యంలో చింతపల్లిగూడ గ్రామానికి చెందిన బాధితుడు జోగు స్వామి తండ్రి రాములు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆదిభట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చింతపల్లిగూడ గ్రామంలో జోగు స్వామి ఇంటి ముందు గణేష్ మండపం నిర్మాణానికి అవసరమైన స్థలం ఉన్నప్పటికీ, రాకపోకలకు అడ్డంకిగా ఉండే విధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గణేష్ మండప నిర్మాణం చేపడుతున్నారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ విషయంలో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, బాధితుడికి న్యాయం చేయాలని కమిషనర్‌ను కోరారు. వినతిపత్రంపై సత్వరమే స్పందించిన కమిషనర్ సత్యనారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి బంగారుగల్ల మహేందర్, మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షులు లపంగి రాజు, కార్యదర్శి నెమలి సత్యనారాయణ, సీనియర్ నాయకులు బూతం రమణ, అడ్వకేట్ పల్లాటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

గౌరెల్లిలో ఘనంగా మద్రాస్ ఫిల్టర్ కాఫీ ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీని ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాటసింగారం బ్యాంకు చైర్మన్, మాజీ సర్పంచ్, పెద్ద అంబర్‌పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల అరుణ, సురేందర్ యాదవ్ హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో కాఫీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గ్యార వీరస్వామి, చెంచల నాగరాజు, పురం శేఖర్ రెడ్డి, మునుకుంట్ల శేఖర్ గౌడ్, గ్యార బాల నరసింహ, శెట్టి గారి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ గౌరెల్లి ప్రాంతంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాఫీ, టీ ప్రియులకు రుచికరమైన, నాణ్యమైన పానీయాలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా మద్రాస్ ఫిల్టర్ కాఫీకి మంచి పేరు, ప్రఖ్యాతి ఉందని, అదే నాణ్యతతో గౌరెల్లి ప్రాంత ప్రజలకు ఫిల్టర్ కాఫీని అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రంగారెడ్డి

పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో కుంట్లూరు, పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు విద్యార్థుల భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న విద్యార్థులు నృత్యాలు, భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ ప్రతినిధి బెరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బి.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు భగవద్గీతలోని విలువలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, నైతికత, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. ప్రశాంత్ కుమార్ భగవద్గీతలోని కర్తవ్యనిష్ఠ, మనోనిగ్రహం, సమత్వ భావన, నిస్వార్థ సేవ వంటి విలువలను విద్యార్థులకు వివరించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

ఇది 1000 రోజుల ప్రభుత్వ పాలన కాదు.. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పీడన! – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి

పున్నమి: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు చేపడుతున్న “కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట” కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు 420 అడుగుల కాంగ్రెస్ 420 హామీల ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) తో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కారణంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.