Sunday, 13 September 2026
  • Home  
  • పెట్రోల్ బంక్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం వాహనాలను ఢీకొట్టి.. బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు ధ్వంసం
- రంగారెడ్డి

పెట్రోల్ బంక్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం వాహనాలను ఢీకొట్టి.. బంక్‌లోకి దూసుకెళ్లిన బస్సు ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు ధ్వంసం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండలం: బాటసింగారం, భారత్ పెట్రోల్ పంప్‌లో గురువారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెట్రోల్ పోస్తున్న రెండు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పిన బస్సు పెట్రోల్ పంప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు, బాలెనో కారు దెబ్బతిన్నాయి. బస్సు ఢీకొనడంతో పెట్రోల్ పంప్‌లోని ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు తదితర పరికరాలు ధ్వంసమయ్యాయి. దీంతో పెట్రోల్ పంప్ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్‌పై కేసు నమోదు గురువారం ఉదయం సుమారు 10:45 గంటలకు ప్రమాదం జరిగినట్లు పెట్రోల్ పంప్ మేనేజర్ బైరూ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండలం: బాటసింగారం, భారత్ పెట్రోల్ పంప్‌లో గురువారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెట్రోల్ పోస్తున్న రెండు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పిన బస్సు పెట్రోల్ పంప్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు, బాలెనో కారు దెబ్బతిన్నాయి. బస్సు ఢీకొనడంతో పెట్రోల్ పంప్‌లోని ఆయిల్ డిస్‌ప్లే, పెట్రోల్ గన్, పిల్లర్, విద్యుత్ వైర్లు తదితర పరికరాలు ధ్వంసమయ్యాయి. దీంతో పెట్రోల్ పంప్ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.

డ్రైవర్‌పై కేసు నమోదు

గురువారం ఉదయం సుమారు 10:45 గంటలకు ప్రమాదం జరిగినట్లు పెట్రోల్ పంప్ మేనేజర్ బైరూ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన హైర్ బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.