संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన దేవకీ వాసు దేవా రావు..

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన దేవకీ వాసు దేవా రావు..

ఖమ్మం, మే
( పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి )

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” కింద ఖమ్మం రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈరోజు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి వల్ల ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

అలాగే ప్రధాని మోదీ సూచించిన స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, ఇంధన పొదుపు, సహజ వ్యవసాయం వంటి అంశాలను ప్రజలు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నకిరకంటి వీరభద్రం, దార్ల శంకర్ గౌడ్, మారుతి వీరభద్ర ప్రసాద్, శాసనాల సాయిరాం, ఎలిశెట్టి మణికంఠ, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులని పరిశీలించిన దేవకీ వాసు దేవా రావు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *