Monday, 18 May 2026
  • Home  
  • నానక్‌నగర్‌లో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం
- E-పేపర్

నానక్‌నగర్‌లో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం

నానక్‌నగర్‌లో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం రైతులు, కూలీల హక్కుల సాధనకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం పున్నమి న్యూస్ ప్రతినిధి 18 మే 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: రంగారెడ్డి జిల్లా నానక్‌నగర్ గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ రైతులు, కూలీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుతూ, రైతులు మరియు కూలీలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని తీర్మానించారు. సమావేశంలో ముఖ్యంగా గ్రామ పరిధిలో కోర్టు స్టే అమలులో ఉండగానే ప్రభుత్వ అధికారులు చట్ట విరుద్ధంగా పనులు కొనసాగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసైన్మెంట్ భూములకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి భూముల పోసిషన్ చూపించే వరకు గ్రామంలో ఎటువంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేశారు. ఇంకా భూములు ఇవ్వని రైతుల పేర్లను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రిజిస్ట్రేషన్ హక్కులు సహా అన్ని హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీకి సంబంధించిన జి.ఓ. 31ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రైతాంగాన్ని నష్టపరిచే ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ మరియు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశం అనంతరం గ్రామంలో అక్రమంగా పనులు నిర్వహిస్తున్న టీజీఐఐసీ అధికారులతో గ్రామస్తులు మాట్లాడారు. పనులు కొనసాగించడానికి సంబంధించి అధికారిక పత్రాలు తమ వద్ద లేవని అధికారులు అంగీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆర్డీవో మౌఖిక ఆదేశాల మేరకే పనులు కొనసాగిస్తున్నామని టీజీఐఐసీ అధికారి ఉమామహేశ్వర్ రావు పేర్కొన్నారని తెలిపారు. అధికారిక పత్రాలు చూపించే వరకు పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేయడంతో వారు పనులు బంద్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫార్మా సిటీ వ్యతిరేక పోరాటం ఉధృతం నానక్‌నగర్ రైతులు – కూలీల ఐక్య గళం • కోర్టు స్టే ఉన్నా అక్రమ పనులు ఆపాలి • అసైన్మెంట్ భూములకు సమాన నష్టపరిహారం ఇవ్వాలి • జి.ఓ. 31 వెంటనే రద్దు చేయాలి – ఫార్మా సిటీ – ఫ్యూచర్ సిటీ – గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రద్దు చేయాలి – రైతుల హక్కులు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుంది **ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ

నానక్‌నగర్‌లో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం

రైతులు, కూలీల హక్కుల సాధనకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయం

పున్నమి న్యూస్ ప్రతినిధి
18 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:

రంగారెడ్డి జిల్లా నానక్‌నగర్ గ్రామంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గ్రామ రైతులు, కూలీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ భూములను కాపాడుతూ, రైతులు మరియు కూలీలకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని తీర్మానించారు.
సమావేశంలో ముఖ్యంగా గ్రామ పరిధిలో కోర్టు స్టే అమలులో ఉండగానే ప్రభుత్వ అధికారులు చట్ట విరుద్ధంగా పనులు కొనసాగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసైన్మెంట్ భూములకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి భూముల పోసిషన్ చూపించే వరకు గ్రామంలో ఎటువంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేశారు.
ఇంకా భూములు ఇవ్వని రైతుల పేర్లను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రిజిస్ట్రేషన్ హక్కులు సహా అన్ని హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీకి సంబంధించిన జి.ఓ. 31ను వెంటనే రద్దు చేయాలని కోరారు. రైతాంగాన్ని నష్టపరిచే ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ మరియు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
సమావేశం అనంతరం గ్రామంలో అక్రమంగా పనులు నిర్వహిస్తున్న టీజీఐఐసీ అధికారులతో గ్రామస్తులు మాట్లాడారు. పనులు కొనసాగించడానికి సంబంధించి అధికారిక పత్రాలు తమ వద్ద లేవని అధికారులు అంగీకరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆర్డీవో మౌఖిక ఆదేశాల మేరకే పనులు కొనసాగిస్తున్నామని టీజీఐఐసీ అధికారి ఉమామహేశ్వర్ రావు పేర్కొన్నారని తెలిపారు. అధికారిక పత్రాలు చూపించే వరకు పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు తెలియజేయడంతో వారు పనులు బంద్ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫార్మా సిటీ వ్యతిరేక పోరాటం ఉధృతం
నానక్‌నగర్ రైతులు – కూలీల ఐక్య గళం
• కోర్టు స్టే ఉన్నా అక్రమ పనులు ఆపాలి
• అసైన్మెంట్ భూములకు సమాన నష్టపరిహారం ఇవ్వాలి
• జి.ఓ. 31 వెంటనే రద్దు చేయాలి
– ఫార్మా సిటీ – ఫ్యూచర్ సిటీ – గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రద్దు చేయాలి
– రైతుల హక్కులు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుంది
**ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.