✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పుగోదావరి జిల్లా
అనపర్తి, జూలై 5: అనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత శనివారం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించిన ఆమె, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యానికి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, జీఎస్‌ఎల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, నారాయణరెడ్డి కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి సత్యనారాయణరెడ్డి, యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఐపీఎస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా కూటమి నాయకులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





