Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ మే 13 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్స్‌లో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది.
  • ఈ శుభకార్యానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వధూవరులు జీవితాంతం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.

ముస్తాబాద్ మే 13 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్స్‌లో పోతుగల్ గ్రామ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వధూవరులు జీవితాంతం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలు, పరస్పర ప్రేమాభిమానాలతో కొత్త జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీర్వదించారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *